చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. అలాగే గాల్ బ్లాడర్ లో కూడా రాళ్లు ఏర్పడడం ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న సమస్య. అయితే కిడ్నీలో వచ్చే రాళ్లకు, గాల్ బ్లాడర్  లో వచ్చే రాళ్లకు కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. గాల్ బ్లాడర్లో వచ్చే రాళ్లు చిన్నవిగా గట్టిగా ఉంటాయి. మన శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఏర్పడినప్పుడు ఇవి లవణాల రూపంలో ఏర్పడి బఠానీ గింజల లాగా ఏర్పడతాయి.

గాల్ బ్లాడర్ రాళ్లు ఏర్పడ్డాయి అనడానికి కనిపించే లక్షణాలు.

గాల్ బ్లాడర్  రాళ్లు ఏర్పడినప్పుడు కడుపు కుడి భాగంలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి కడుపు మధ్యభాగంలో కూడా నొప్పి వస్తుంది. భుజం దగ్గర భుజం వెనకాడ భాగంలో కుడి భుజం నొప్పిగా, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం కడుపు ఎప్పుడు కూడా బరువుగా అనిపించడం, తరచుగా విరోచనాలకు వెళ్లడం లేదా మలబద్దకంగా ఉండడం కూడా గాల్ బ్లాడర్  రాళ్లు ఏర్పడడానికి లక్షణాలుగా చెప్పవచ్చు.

కారణాలు- గాడ్ బ్లాడర్ మన జీర్ణ క్రియ కు అవసరమైన అనేక ఎంజైములను నిల్వ చేస్తూ ఉంటుంది. అయితే గర్ల్ బ్లాడర్ లో ఉన్న తేమ శాతం అంతా కూడా ఎండిపోయినప్పుడు అందులో ఉప్పు, ఇతర సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా కలిసిపోయి చిన్న చిన్న రాళ్ల రూపంలో గా ఏర్పడతాయి. వీటినే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని అంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు కొలెస్ట్రాల్ ,బిల్లు రూబిన్ వంటివి కూడా గాల్ బ్లాడర్  రాళ్లుగా ఏర్పడతాయి. ఇవి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి ఎందుకు ఏర్పడతాయి. అనేదానికి స్పష్టమైన కారణం ఈరోజు కూడా తెలియదు. ముఖ్యంగాగాల్ బ్లాడర్ రాళ్లు ఏర్పడడానికి ఈ అంశాలు ఉన్నాయి. షుగర్ అధికంగా ఉన్నప్పుడు ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం కొంతమందిలో గర్భధారణ సమయంలో అధికంగా మందులు తీసుకునేవారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా ఈ గాల్ బ్లాడర్ లో రాళ్లు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది.

చికిత్స- గాల్ బ్లాడర్ లో  రాళ్లు ఏర్పడినప్పుడు మనం ఇంట్లో ఉపయోగించ కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్, దోసకాయ వంటి వాటిని తీసుకోవడం ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లను తగ్గించుకోవచ్చు. పుదీనా రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కూడా గాల్ బ్లాడర్ లో రాళ్లు రాకుండా ఉంటుంది.

వెల్లుల్లి- వెల్లుల్లి ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గాల్ బ్లాడర్ వచ్చే రాళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు.

Health Tips: రోజులో మనం ఎంత చక్కర తీసుకోవాలో తెలుసా.. 

ముల్లంగి రసం- ముల్లంగి రసాన్ని ప్రతిరోజు ఆహారంలో బాగా చేసుకోవడం ద్వారా గాల్ బ్లాడర్ ఏర్పడే రాళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. రోజు మొత్తంలో ఐదు నుంచి 6 స్పూన్ల ముల్లంగి రసాన్ని తీసుకున్నట్లయితే మీ గర్ల్ బ్లాడర్ లో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి.

బీట్రూట్ రసం- బీట్రూట్లో పీచు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ డ్రెస్సులు రక్తంలోని కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా మీ గర్ల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ప్రతిరోజు ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

గ్రీన్ టీ- గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇది పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ప్రతిరోజు రెండు కప్పుల గ్రీన్ టీన్ తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి