gas

ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య కడుపులో మంట, గుండెల్లో మంట ఇది సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు గుండె మంటను గుండెపోటుగా బ్రమపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా మందిలో గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడుతుంది, భోజనం చేసిన వెంటనే ఎక్కువ మంటగా అనిపించడం పుల్లటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ కడుపు మంట గుండె మంట వంటి సమస్యలు వస్తాయి. ఈ కడుపు మంటను తగ్గించుకోవడానికి ఈరోజు కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం.

పుదీనా: పుదీనాను ప్రతిరోజు ఆహారం తీసుకున్న తర్వాత తిన్నట్లయితే మీకు ఈ కడుపు మంట తగ్గిస్తుంది. అంతేకాకుండా తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో పుదీనా సహాయపడుతుంది. పుదీనా ఆకులను మరిగించి చల్లార్చిన నీటిని తీసుకున్నట్లయితే మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసే ఈ కడుపు మంటను కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

మజ్జిగ: కడుపులో మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసేది మజ్జిగ మజ్జిగ తీసుకోవడం ద్వారా మన కడుపులో మంట తగ్గిపోయి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇది ఎసిడిటీది తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం ద్వారా మీ కడుపు మంట సమస్య తగ్గిపోతుంది.

Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా.

పుచ్చకాయ: పుచ్చకాయ చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపులో మంట వచ్చినప్పుడు ఇందులో అధిక మొత్తంలో ఉన్న నీరు మన కడుపు మంటను తగ్గిస్తుంది. దీన్ని మీరు రెగ్యులర్ గా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉండి కడుపుబ్బరం అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

సోంపు నమలడం: మీకు అజీర్ణం ,కడుపుబ్బరం కడుపు మంట అనిపించినప్పుడు ఒక స్పూన్ సోంపు గింజలను తిన్నట్లయితే మీకు జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. భోజనం చేసిన తర్వాత సోంపం తినడం వల్ల అజీర్ని సమస్య నుండి బయటపడతారు. అంతేకాకుండా కడుపులో మంట కూడా తగ్గిపోతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.