Health Tips: ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా కనిపించే సమస్య కంటి చూపు తగ్గడం, పోషకాహార లోపం ఎక్కువగా ఫోన్ లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూడడం ద్వారా కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే వీటిని గల కారణాలు నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకస్మిక దృష్టి లోపం- కొంతమందిలో ఆకస్మికంగా దృష్టి తగ్గుతూ ఉండడం గమనిస్తుంటాము. దీనికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా వాడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనిని ఆప్టిక్ న్యూరోసిస్ అని అంటారు. దీనివల్ల వీరికి సడన్గా దృష్టి తగ్గిపోవడం అనే సమస్య ఏర్పడుతుంది.
Health Tips: గొంతులో కఫం ఎక్కువగా పేరుకుపోయిందా..
డబల్ విజన్- కొంతమందిలో ఈ సమస్య వల్ల చూపు ఒక్కొక్కసారి రెండుగా కనిపిస్తుంది. చూసే పరికరాలు అన్నీ కూడా రెండుగా కనిపిస్తుంది. దీన్నే డబల్ విజన్ అనిపిస్తుంది.
వీటికి గల కారణాలు- వీటికి గల కారణాలు చూసుకున్నట్లయితే కంటి నరాలు దెబ్బ తినడం బి 12 లోపం తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వారికి ఈ కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఈ కంటి సమస్యలు ఎక్కువగా ఎక్కువ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.
చిట్కాలు- కంటి ఆరోగ్యం మెరుగవ్వడం కోసం కొన్ని రకాలైనటువంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ దృష్టిలోపము వంటి సమస్యలను తొలగించుకోవచ్చు.
మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ప్రోటీన్ అధికంగా ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
కంటి నరాల కోసం విటమిన్ బి12 అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇవి ముఖ్యంగా జంతు సంబంధ వాటిలో అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా వీటి వల్ల లోపం ఉండదు. ధూమపానం మద్యపానం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. కంటికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి