Black Raisins (Photo Credits: Wikimedia Commons)

ఎండుద్రాక్ష రెండు రకాలుగా ఉంటుంది. తెలుపు ఎండు ద్రాక్ష, నలుపు ఎండు ద్రాక్ష. తెల్లటి ఎండు ద్రాక్షతో పోలిస్తే నలుపు రంగు ఎండు ద్రాక్షలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. దీన్ని మీరు ప్రతి రోజు మీ డైట్ లో భాగం చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీనిలో మనకు కావాల్సిన అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి.

ఎండు ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు.

జీర్ణ వ్యవస్థ: ఇందులో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది.

దీనిలో ఉన్న ఫైబర్ వల్ల మన శరీరంలోని  టాక్సిన్స్ ను బయటికి పంపించి జీర్ణ సమస్యల నుండి బయటపడేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం ద్వారా మలబద్ధకం సమస్య నుండి దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా మన ఆహారంలో నాలుగు ఎండు ద్రాక్షలను ప్రతి రోజు తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ బలోపేతం అయితుంది. అంతేకాకుండా కడుపుకు సంబంధించిన అనేక రకాలైనటువంటి సమస్యలను తగ్గించడంలో ఈ ఎండు ద్రాక్ష సహాయపడుతుంది.

బీపీని కంట్రోల్ చేస్తుంది: ప్రతిరోజు నల్ల ఎండు ద్రాక్షలు తీసుకోవడం ద్వారా మన బీపీ కంట్రోల్ అవుతుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో మనకు సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ పుష్కలంగా ఉండడం ద్వారా మన గుండె ఆరోగ్యానికి మంచిది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ నల్ల ఎండు ద్రాక్ష సహాయపడుతుంది.

Health Tips: PCOS సమస్యతో బాధపడుతున్నారా

బరువు తగ్గడం: ప్రతిరోజు నల్ల ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్ రిచ్ గా ఉంటుంది. కాబట్టి కొంచెం తీసుకున్నప్పటికి కూడా కడుపు నిండిన విధంగా అనిపించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఎముకలకు మంచిది: ప్రతిరోజు ఎండు ద్రాక్ష నల్ల ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి మన శరీరంలో ఉన్న ఎముకలకు ఆరోగ్యానికి మంచిది. ఇందులో కాల్షియం ఫాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉండడం. ద్వారా ఇది మన కండరాల పెరుగుదలకు ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దీన్ని తీసుకోవడం ద్వారా మన పిల్లల్లో ఎదుగుదలకు తోడ్పడుతుంది.

జుట్టుకు మంచిది: నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్, జింక్, విటమిన్ b6 వంటి అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన చర్మాన్ని జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయటపడతాము. అంతేకాకుండా మన చర్మాన్ని నిగారింపు పెంచుతుంది. జింక్ ,విటమిన్ బి6 వల్ల మన జుట్టు రాలే సమస్య నుండి బయట పడతాము. జుట్టు కుదుళ్లకు బలంగా బలాన్ని ఇస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి