Health Tips: కొన్నిసార్లు మన జీవనశైలిలో చేసే చిన్న చిన్న మార్పులే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. చెడు ఆహారపాలవాట్లకు దూరంగా ఉండటం , మంచి ఆహారాలు తీసుకోవడం ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం. సరైన జీవనశైలిని అవలంబించడం వల్ల మన ఆయుష్షును మనం పెంచుకోవచ్చు. అయితే మనం తీసుకునే జీవనశైలిల మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాహారాలు- తీసుకునే ఆహారంలో ఎక్కువగా పండ్లు కూరలు ఉండే విధంగా చూసుకుంటే మంచిది. అన్ని రకాల పండ్లు చేర్చుకోవాలి నీరును 6 నుంచి 8 గ్లాసులు తీసుకోవాలి. తృణధాన్యాలు మొలకలు కూడా ఉండేలాగా చూసుకోవడం ద్వారా మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు పోషకాలు అందుతాయి..

Health Tips: తరచుగా గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారా,

సీజనల్ ఫ్రూట్స్- సీజనల్గా వచ్చే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి దీని ద్వారా మన శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీ అందుతుంది. దీనివల్ల సీజనల్గా వచ్చే అనేక రకాల జబ్బులు తొలగిపోతాయి. ముఖ్యంగా జలుబు జ్వరాలు వంటివి ఇమ్యూనిటీ లోపం వల్లనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి సీజనల్ గా దొరికే పండ్లను తినడం ద్వారా ఈ సమస్యలు తగ్గుతాయి.

మసాలా దినుసులు- అల్లం జీలకర్ర వంటి వాటిని కషాయం లాగా చేసుకుని తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన వాత కఫ పిత్త దోషాలు తొలగిపోతాయి.

నిద్ర- ఆయుర్వేదం ప్రకారం మనిషికి ఎంత నిద్ర ఉంటే తాను తన అన్ని వ్యాధుల నుండి తొందరగా కోలుకుంటాడని నానుడి కాబట్టి నిద్రను చక్కగా పోవాలి. నిద్ర కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి.

వ్యాయామం- వ్యాయామం చేయడం ద్వారా అనేక రకాల వత్తుడల నుంచి బయటపడతారు. వ్యాయామం చేయడం వల్ల అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి. అధికంగా ఉండే బరువు తగ్గుతారు. దీంతోపాటు మెడిటేషన్ ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి.

ఈ మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి