ఉసిరికాయ మన ఆరోగ్యానికి సంజీవని గా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. జుట్టుకు, చర్మానికి ఎంతో ప్రయోజనకరం. అయితే కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం ఈ ఉసిరికాయను తీసుకోకూడదు. వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఉసిరికాయలను ఏ జబ్బులు ఉన్నవారు తీసుకోకూడదు. ఈరోజు మనం తెలుసుకుందాం.
గ్యాస్ సమస్యలు: మీరు కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉసిరికాయను తీసుకోకూడదు .ఇందులో యాసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ గ్యాస్ సమస్యలను మరింతగా పెంచుతుంది. అటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యమి సలహా లేకుండా ఉసిరికాయలను వాడకూడదు.
షుగర్ పేషెంట్స్: ఉసిరికాయలను షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఇది మన రక్తంలోని చక్కెర లెవల్సును ఇన్ బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడేవారు పరిమిత పరిమాణంలో మాత్రమే ఈ తీసుకోవాలి వైద్యులను సంప్రదించి తీసుకోవాలి.
Health Tips: రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటున్నారా.
గర్భిణీలు: గర్భధారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉసిరికాయలను ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో యాసిడ్ కంటెంట్ అధికంగా ఉండడం ద్వారా గర్భిణీలకు అంత మంచిది కాదు.
కొలెస్ట్రాల్ మందులు వేసేవారు: మీరు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఉసిరికాయను తీసుకోకూడదు మీరు రక్తాన్ని పల్చగా చేసే మందులు తీసుకున్నట్లయితే ఈ ఉసిరికాయ ఇంకా రక్తాన్ని పలచన చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీకు రక్తస్రావం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరు తీసుకోకపో పోవడం ఉత్తమం.
థైరాయిడ్ ఉన్నవారు: థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు ఉసిరికాయను తీసుకోకూడదు. ఇది అయోడిన్ తీసుకునే విధానంలో ప్రభావితం చేస్తుం.ది కాబట్టి అయోడిన్ లోపం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఉసిరికాయలను తీసుకోకూడదు.
ఎలర్జీ ఉన్నవారు: ఎలర్జీ ఉన్నవారు కూడా ఉసిరికాయను తీసుకోకూడదు. ఇది మీ ఎలర్జీని ఇంకా అధికం చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉసిరికాయను మీ ఆహారంలో భాగం చేసుకోకుండా ఉంటేనే మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.