thyroid

ఈ మధ్యకాలంలో చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. ఇది ఒక హార్మోన్ ఇది థైరాక్సిన్  అనే హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. మన శరీరానికి ఈ హార్మోన్ అనేది చాలా అవసరం. ఇది సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు థైరాయిడ్ సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఈ సమస్య ముఖ్యంగా పురుషులకంటే స్త్రీలలో అధికంగా ఉంటుంది. దీని ద్వారా బరువు పెరగడం ,తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా శరీరంలో రకరకాలైన మార్పులు కూడా కనిపిస్తాయి. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 గ్లూటెన్ ఆహార పదార్థాలు: బార్లీ ,గోధుమలు గ్లూటెన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం థైరాయిడ్ ఉన్న వ్యక్తులకు హానికరం. ఇది థైరాయిడ్ గ్రంథిని మరింత వాపు కు గురిచేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో గ్లూటెన్ లేకుండా చూసుకోవడం మంచిది.

కాఫీ, టీలు:  థైరాయిడ్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ టీలకు తీసుకోకూడదు. ఎందుకంటే దీనిలో కెఫిన్ ఉండడం వల్ల థైరాయిడ్ గ్రంధిని మరింతగా వాపు గురిచేస్తుంది. ఇది మన శరీరంలో ఉన్న థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి కాఫీ టీలకు దూరంగా ఉండాలి.

క్యాబేజీ ,క్యాలీఫ్లవర్: మీకు థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే క్యాబేజీ ,క్యాలీఫ్లవర్ ను తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఇది మీ థైరాయిడ్ సమస్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది.

ఆల్కహాల్ : థైరాయిడ్ రోగులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ గ్రంధి పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని కారణంగా థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి చేయవు. మీ సమస్యను మరింతగా జఠలం చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకోకపోవడమే ఉత్తమం.

స్వీట్స్:  థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎక్కువ స్వీట్స్ ను తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఎటువంటి పోషకాలు కూడా ఉండవు. ఇది మీకు జీర్ణ క్రియను మందగించేలా చేస్తుంది. కాబట్టి మీరు బరువు పెరుగుతారు. దాని ద్వారా మీ థైరాయిడ్ సమస్య ఇంకా అధికమవ్వవచ్చు.

ఆయిల్ ఫుడ్స్: థైరాయిడ్ రోగులు ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఆయిల్ ఫుడ్స్ వల్ల వారి హార్మోన్లో ఇంబాలన్స్ ఏర్పడుతుంది. దీని ద్వారా థైరాయిడ్ సమస్య అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.