Health Tips: పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పులో అనేక రకాల పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి. పప్పు తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది. మాంసాహారం తినని వారికి ప్రోటీన్ సోర్స్ గా పప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే కొన్ని రకాల పప్పులు జీర్ణక్రియ బలహీనంగా ఉన్న వారికి అనేక రకాల సమస్యలను తీసుకొని వస్తాయి. ముఖ్యంగా కడుపుబ్బరం, గ్యాస్ ట్రబుల్, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ కొన్ని రకాల పప్పు ధాన్యాలను తినకూడదు. అవి మీ జీర్ణ వ్యవస్థను ఇంకా బలహీన పరుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోవాలి..
పెసరపప్పు-పెసరపప్పు ప్రోటీన్ కి చాలా మంచి సోర్స్ గా చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ప్రోటీన్ లభిస్తుంది. కానీ జీర్ణక్రియ సక్రమంగా లేని వారికి ఇది జీర్ణం కావడానికి కాస్త టైం పడుతుంది. జీర్ణ క్రియ బలహీనంగా ఉన్నవారు పెసరపప్పును తీసుకోకూడదు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ కడుపుబ్బరం, కడుపులో నొప్పి, వంటి సమస్యలను ఇంకా తీవ్ర ఉత్తరం చేస్తుంది. కాబట్టి గ్యాస్ సమస్య ఉన్నవారు పెసరపప్పును తీసుకోకుండా ఉంటేనే మంచిది.
Health Tips: రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగుతున్నారా?
ఎర్ర పప్పు- ఎర్ర పప్పులో చాలా ప్రోటీన్ ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఇది జీర్ణం కావడం అంతా సులభం కాదు. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు గ్యాస్ సమస్య ఉన్నవారు కడుపులో నొప్పి ఉన్నవారు ఈ పప్పుకు దూరంగా ఉండాలి. దీన్ని తీసుకోవడం ద్వారా విరోచనాలు వంటి సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
శనగపప్పు-శనగపప్పును చాలామంది ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు. శనగపప్పుతో టిఫిన్స్ కూడా చేసుకుంటారు. డోక్లా వంటి వాటిని కూడా తయారు చేసుకుంటారు. శనగపప్పుతో కిచిడి వంటివి కూడా తయారు చేస్తారు. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోవడం అంతా మంచిది కాదు. శనగపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. నేను తీసుకోవడం కావడానికి చాలా సమయం పడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. శనగపప్పును జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా శనగపప్పును ఆహారంలో భాగం చేసుకోకూడదు ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి