Mushrooms-1

చాలామందికి పుట్టగొడుగులు తినడం ఇష్టంగా ఉంటుంది. అయితే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలతో పాటు విటమిన్ డి కి మంచి సోర్స్ గా ఉంటుంది. పుట్టగొడుగులను శాకాహారుల నాన్ వెజ్ అని కూడా పిలుస్తారు. పుట్టగొడుగులు ఆరోగ్యానికి మాత్రమే కాదు రుచి కూడా చాలా ఉంటుంది. మష్రూమ్ టిక్కా, మష్రూమ్ కర్రీస్, వంటి వాటిలలో పుట్టగొడుగులను వాడుతారు. అయితే పుట్టగొడుగులను కొంతమందికి ఇది కొన్ని అనారోగ్య సమస్యలను తీసుకొని వస్తుంది. అయితే ఎవరు ఈ పుట్టగొడుగులను తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్థరైటిస్- ఆర్థరైటి సమస్య ఉన్నవారికి పుట్టగొడుగులు అంత మంచివి కాదు. వీటిని తినడం వల్ల వీళ్లలో కాళ్ల నొప్పులు కండరాల నొప్పులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా తినడం వల్ల వాళ్లకి కొద్దిగా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది..

Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...

జీర్ణ సమస్యలు- జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మష్రూమ్లో తినకూడదు. ఇది జీర్ణ క్రియ కు సంబంధించిన అనేక సమస్యలను తీసుకొని వస్తుంది. పుట్టగొడుగు ఒక ఫంగస్ కాబట్టి ఇది కొంచెం కొంతమందిలో దీన్ని తీసుకోవడం వల్ల వాంతులు, అజీర్ణం, అతిసారం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు పుట్టగొడుగులను తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉండడం ద్వారా ఇది జీర్ణం కావడానికి కూడా టైం పడుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. కొంతమందిలో ఇన్ఫెక్షన్ వస్తుందన్న భయం కూడా ఉంటుంది.

గర్భవతులు ,బాలింతలు- గర్భిణులు బిడ్డకు పాలిస్తున్న వారు పుట్టగొడుగులు తినే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించి తింటే మంచిది. కొన్ని అధ్యయనాల ప్రకారం పుట్టగొడుగులు కడుపులో ఉన్న బిడ్డకు లేదా తల్లిపాలు తాగే శిశువుకి కొన్ని రకాల అనారోగ్య సమస్యలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి..

ఎలర్జీ సమస్య ఉన్నవారు- పుట్టగొడుగులు తినడం ద్వారా ఎలర్జీ సమస్య ఉన్నవారికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చర్మం పైన దద్దుర్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దురదలు వంటి సమస్యలను తీసుకొని వస్తుంది. అటువంటి వారు కూడా వీటిని తినకుండా ఉంటేనే ఉత్తమం..

కిడ్నీ రోగులు- కిడ్నీ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పుట్టగొడుగుల్లో తీసుకోకూడదు. ఇది మూత్రపిండాలపైన అధిక భారాన్ని కలిగించి మూత్రపిండాల వ్యాధిని మరింతగా పెంచుతుంది. కనుక కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులకు దూరంగా ఉంటే మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి