గుమ్మడి గింజలు అనేక రకాలైనటువంటి పోషకాలను కలిగే ఉంటాయి. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గుమ్మడి గింజల్లో గుండె, మధుమేహం, రక్తపోటు నిద్ర లేకపోవడం, వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుమ్మడి గింజల్లో అమైనో యాసిడ్ టిప్టో ఫ్యాన్ మన శరీరంలోని సెరటోనిన్ ని పెంచుతుంది. దీని ద్వారా నిద్రలేమి ఉన్నవారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె రోగులకు చాలా మేలు చేస్తాయి. గుండె జబ్బులు ఉన్నవారు గుమ్మడికాయ గింజలు తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇది చెడు కొలెస్ట్రాల తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
గుమ్మడి గింజలు డయాబెటిక్ రోగులకు అద్భుతవరం.
గుమ్మడి గింజల్లో జీర్ణం అయ్యే ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని చక్కర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి ప్యాంక్రియాస్ పనితీరును క్రమపరుస్తుంది. డయాబెటిక్ రోగులు గుమ్మడి గింజలు తీసుకుంటే వీరికి అనేక రకాల లాభాలు ఉంటాయి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో జింక్ కూడా ఉంటుంది. గుమ్మడి గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది మన శరీరంలోను నొప్పి జ్వరం వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం ద్వారా ఇది మలబద్ధకం సమస్య నుండి కూడా బయటపడేస్తుంది.
షుగర్ పేషెంట్స్ ఎలా తీసుకోవాలి
గుమ్మడి గింజలను తీసుకొని వాటిని శుభ్రం చేసి ఒకరోజు ఎండలో ఎండబెట్టుకొని వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ప్రతి రోజు ఐదు గ్రాముల పొడిని పాలతో కలిపి ఉదయం లేదా రాత్రి పూట తీసుకున్నట్లయితే మీకు షుగర్ కంట్రోల్ లో ఉంటుం.ది ఇలా కాకుండా గుమ్మడి గింజలు మీరు వేయించుకొని కూడా తినవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.