మన ఇళ్లల్లో కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని మళ్లీ మనం తిరిగి తినడానికి ఉంచుకుంటాము. అయితే మళ్లీ తినేటప్పుడు వాటిని వేడి చేసి తింటాము. అలా వేడి చేయడం వల్ల అది ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా. ముఖ్యంగా ఈ మూడు ఆహార పదార్థాలను పొరపాటున కూడా మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. వీటిని వేడి చేయడం వల్ల వీటిలో జరిగే అనర్ధాలు ఏంటో తెలుసుకుందాం. ఆ పదార్థాలు ఏంటో కూడా తెలుసుకుందాం.
టీ: టీ ని మనందరం ప్రతిరోజు ఉదయం లేవగానే తాగుతూ ఉంటాం. అయితే టీ ని తయారు చేసుకున్న తర్వాత అది ఒకసారే తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ వేడి చేయడం. ద్వారా దాంట్లో అధిక స్థాయిలో టానీన్ ఏర్పడుతుంది. ఇది మన శరీరంలో ఉన్న అనేక రకాలైన పోషకాలను అందించకుండా చేస్తుంది. మన శరీరంలో ఐరన్ లోపాన్ని పెంచుతుంది. అంతేకాకుండా మనకు తీవ్ర ఎసిడిటీని కలిగించి గ్యాస్ ప్రాబ్లం ని పెంచుతుంది. మరలా మరలా వేడి చేయడం. ఇది హానికరంగా మారుతుంది. కాబట్టి టీ ని ఎప్పుడైనా మరల మరల వేడి చేయకుండా తాగాలి.
Health Tips: ఉసిరికాయను రోజూ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ ...
వంటనూనె: మనము వంట నూనెను కూడా మరల మరల వేడి చేయకూడదు. మన ఇళ్లలో పూరీలు తయారు చేసినప్పుడల్లా మిగిలిపోయిన నూనెను నిల్వ చేస్తూ ఉంటాం. దాన్ని మరల మరల వేడి చేసి ఉపయోగించుకుంటాము. అయితే అలా చేయడం చాలా హానికరం. ఈ నూనెను పదేపదే వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. దీని ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా మన ఆరోగ్యం కూడా దెబ్బతింటాయి. నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేయడం ద్వారా గుండె జబ్బులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పాలకూర: పాలకూరని కూడా మరల మరల వేడి చేయకూడదు పాలకూరను మళ్ళీ వేడి చేయడం ద్వారా మోనో సైటోసం అనే బాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇది పాలకూరను విషపూరితం చేస్తుంది. అంతేకాకుండా పాలకూరలో నైట్రైట్ ,ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మరల మరల వేడి చేయడం ద్వారా ఇవి రెండూ కూడా పాడవుతాయి. కాబట్టి దీని తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం. పాలకూర మాత్రమే కాదు ఏదైనా ఆకుకూరను కూడా మరలా మరలా వేడి చేయడం మానుకోవాలి. అంతేకాకుండా బంగాళదుంపలను, కోడిగుడ్లను మిగిలిపోయిన అన్నాన్ని కూడా వేడి మళ్లీ వేడి చేసి తినడం మానుకోవాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.