మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది కొన్ని ముఖ్యమైన పనులు చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి అధిక కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి హానికరం చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకునేవి గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం ,అధిక బరువు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగింది. అనడానికి కొన్ని సంకేతాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చర్మం పైన నల్లటి పొర- చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మన చర్మం పైన నల్లటి పొర ఏర్పడుతుంది. ముఖ్యంగా మెడ కింద చంపల పైన నలుపుదనం కనిపిస్తుంది. అదే విధంగా నుదురు పైన కూడా నలుపుదనం కనిపించినట్లయితే ఇది అధిక కొవ్వుకి సంకేతంగా చెప్పవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లక్షణాన్ని గమనించి వెంటనే వైద్యున్ని సంప్రదించితే మంచిది.
అలసట - ఎంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా అలసట ఎక్కువగా అనిపిస్తే ఇది కూడా అధిక కొలెస్ట్రాలకు నిదర్శనం. తగినంత నిద్ర ఉన్నప్పుడు కూడా అలసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ సాయిలకు సంకేతంగా డాక్టర్లు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు అది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అప్పుడు మనకు అలసట అనేది వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
బీపీ - మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు బీపీ సమస్య కూడా వస్తుంది. రక్తనాళాల్లో ప్రవాహానికి కొలెస్ట్రాల్ అడ్డుపడుతుంది. దీనివల్ల రక్త ప్రవాహం ఎక్కువ పీడనంతో వెళ్తుంది. అప్పుడు అది కరెక్ట్ పోటు అనే సమస్య ఎదురవుతుంది.
చాతి నొప్పి- అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో చాతిలో నొప్పి అనిపించడం ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు. కొన్నిసార్లు ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు శారీరక శ్రమలు ఎక్కువగా చేసినప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువగా అవుతుంది. దీన్నే హ్యాండ్జైనా అని కూడా అంటారు. దమనుండలో కొలెస్ట్రాల్ అడ్డుపడటం వల్ల ఇది వస్తుంది. మీరు క్రమం తప్పకుండా దీన్ని గమనించినట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించుకోవడం ఉత్తమం.
\మధుమేహం- అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ,కొలెస్ట్రాల్ రెండు కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఇవి రెండు కూడా జీవన క్రియను ప్రభావితం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. వ్యాయామం సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.
కొలెస్ట్రాలను తగ్గించే చిట్కాలు.
రోజువారి వ్యాయామం, యోగ, నడక ,జాగింగ్ ,జిమ్ వంటివి శారీరక శ్రమను ఎక్కువగా చేసినప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల మీ బరువు తగ్గుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. షుగర్ బిపి వంటి సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి. మీరు తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, మొలకలను తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. బరువు పెరిగినట్లయితే ఎప్పుడు కూడా బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి