sugar

ఈ మధ్యకాలంలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. వీరి షుగర్ లెవెల్ పెరుగుతుందని తీసుకునే ప్రతి ఆహ్వానం పైన చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే షుగర్ పేషెంట్స్ కొన్ని ఆహార పదార్థాలు తినరు. ముఖ్యంగా అందులో పండ్లు షుగర్ పెరుగుతుందన్న భయంతో షుగర్ పేషెంట్స్ పండ్లు తీసుకోరు. అయితే నిపుణుల ప్రకారం కొన్ని పండ్లు వారికి చాలా మంచిది. షుగర్ పేషంట్లకు ఏ ఏ పండ్లు ఇప్పుడు తెలుసుకుందాం.

సిట్రస్ పండ్లు- నారింజ, ద్రాక్ష ,నిమ్మ జాతికి చెందిన సిట్రస్ పండ్లలో సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉండటం ద్వారా షుగర్ పేషెంట్స్ ఎటువంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మీ జీర్ణ క్రియ కు చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ ప్రతిరోజు మీ ఆహారంలో ఒక సిట్రస్ పండును భాగం చేసుకుంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

బెర్రీస్- బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉండడం ద్వారా ఈ రెండు కూడా మీ షుగర్ లెవెల్ లో కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటివి మధుమేహ రోగులకు ఒక అద్భుత వరంగా చెప్పవచ్చు. ప్రతిరోజు మీరు వీటిని తీసుకోవడం ద్వారా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మీకు గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి.

Health Tips: గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.

కివి- కివి పండులో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ ,ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు మీరు ఒక టీవీ పండును తీసుకున్నట్లయితే మీ ఎముకలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

అవకాడో- అవకాడలో విటమిన్ బి, కె ఇ సి అంటే పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి బయట పడేస్తుంది. రోజువారి జీవితంలో బరువు తగ్గాలి అనుకునేవారు ఆవకాడోన్ని తీసుకోవచ్చు. ఆవకారణం తీసుకోవడం వల్ల మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

ఆపిల్- ఆపిల్ లో అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలో నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ఆహారంలో ఒక ఆపిల్ పండును యాడ్ చేసుకుంటే షుగర్ పేషెంట్లకు మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి