Tomato Representational Image (Photo Credit: ANI)

టొమాటోలు తగిన మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది టొమాటోలను కూరల్లో వాడతారు, మరికొందరు టొమాటో సూప్ తాగడం ఇష్టపడతారు. టొమాటో సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

టొమాటో సూప్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు అమితంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి సాధారణ జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి అవసరం అని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల రాత్రి దృష్టి మెరుగుపడటమే కాకుండా కంటి సమస్యలు చాలా తక్కువగా ఎదురవుతాయి.

టొమాటోలో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. లైకోపీన్ తాగడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే శరీర సంబంధ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది.

మద్యం తాగే సమయంలో ఈ ఫుడ్స్ తీసుకుంటున్నారా.. అయితే మీరు త్వరగా ఆస్పత్రి పాలడవం ఖాయం, వెంటనే ఈ ఆహార పదార్థాలను మెను నుంచి తీసేయండి

ఫైబర్ కూడా టొమాటో సూప్‌లో ఉంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే, టొమాటో సూప్ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది, కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి ఇది మంచి ఎంపిక. టొమాటో సూప్‌లో పొటాషియం, విటమిన్ బి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె సంబంధిత సమస్యలను తక్కువ చేస్తాయ్.

అంతేకాక, టొమాటో సూప్ చాలా రుచికరంగా ఉంటుంది. అయితే, రెడీమేడ్ సూప్ మిక్స్‌లకు బదులుగా, ఇంట్లోనే తాజా టొమాటోలతో సూప్ తయారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే, మార్కెట్‌లో ఉండే రెడీమేడ్ సూప్ మిక్స్‌లలో ఎక్కువ ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది, ఇవి ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. ఇంట్లో టొమాటో సూప్ తయారుచేయడం వల్ల, మీరు మీ ఆరోగ్యం కోసం తగిన మోతాదులో మరియు తాజా పదార్ధాలతో సూప్ తాగవచ్చు.

మొత్తం మీద, టొమాటో సూప్ ఒక రుచికరమైన, పోషక సమృద్ధిగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గుండె, ఎముకలు, కళ్ళు, జీర్ణక్రియ, మరియు బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అందుకే, రోజూ లేదా వారానికి కొన్ని సార్లు తాజా టొమాటో సూప్ తాగడం మన ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరం అని వైద్యులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి