
మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ ఎక్కువగా తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి తీవ్ర హాని కలిగించవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన అంశాలు మీరు తెలుసుకోకుంటే వెంటనే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
చాలా మంది మద్యం సేవిస్తూ బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైడ్ ఫుడ్ వంటి జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అయితే కొవ్వు అధికంగా ఉండే ఈ పదార్థాలు కాలేయంపై భారీ ఒత్తిడి కలిగిస్తాయి. దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్, హార్మోన్ అసమతుల్యత, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఇవి కారణం అవుతాయి. అలాగే మద్యం తీసుకుంటున్న సమయంలో కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫీన్ ఉన్న పానీయాలను అందులో కలపడం కూడా ప్రమాదకరం. ఇది శరీరాన్ని త్వరగా డీహైడ్రేషన్‌కు గురి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపి, తలనొప్పులు, మలబద్ధకం, అల్లకల్లోలాన్ని కలిగించవచ్చు.
మద్యంతో పాటు కారంగా, మసాలాతో కూడిన ఆహారం తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి, గ్యాస్, కాబ్బింగ్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక, చాక్లెట్లు, కేకులు, డెజర్టులు వంటి తీపి పదార్థాలను మద్యంతో కలిపి తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను గరిష్టంగా పెంచుతుంది.ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది అత్యంత ప్రమాదకరం. యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు లేదా ఇతర prescription, drugs తీసుకుంటున్నప్పుడు మద్యం సేవించడం అత్యంత హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ కలయిక శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపి, కాలేయ, గుండె, జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
ఈ నేపథ్యంలో మద్యం సేవించే సమయంలో ఆహార ఎంపికపై అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, ఎక్కువ నీరు, ఫ్రూట్స్, సలాడ్లు, తక్కువ ఉప్పు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు. అలాగే, మద్యం తీసుకుంటున్నప్పుడు హైడ్రేషన్ కు ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం, క్యాఫీన్, అధిక కొవ్వు, మసాలా, తీపి పదార్థాలను దూరంగా ఉంచడం అత్యంత అవసరం.వీటిని పాటించడం ద్వారా మద్యం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, జీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మాత్రం మీరు మరువకండి..
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి