మనలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. దీనివల్ల మనం ఎక్కడ కూడా స్థిమితంగా ఉండలేము. కడుపుబ్బరం, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ చాలా ఇబ్బంది పెట్టే సమస్య. దీనికోసం చాలామంది మార్కెట్లో దొరికే టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మన ఇంట్లో దొరికే పదార్థాలతోటి మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర, ధనియాలు, వాము, ఈ మూడింటిని ఉపయోగించి మనం ఒక కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం తీసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం నుండి బయటపడతారు. ముందుగా ఒక బౌల్ లో ఒక గ్లాస్ నీరు తీసుకొని అందులో జీలకర్ర, వాము, ధనియాలు వేసుకొని అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు దాన్ని వడకట్టుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున మీరు తీసుకున్నట్లయితే క్రమంగా మీ గ్యాస్ ట్రక్ ట్రబుల్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో పాటు మీరు ఆహారంలో పులుపు, కారాలు, మసాలాలు తగ్గించాలి, అదేవిధంగా మాంసాహారాన్ని తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు గ్యాస్ ప్రాబ్లం నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరానికి తగినంత వ్యాయామం అందించినట్లయితే ఈ గ్యాస్ ప్రాబ్లం నుండి బయటపడతారు. దీనివల్ల మీరు అధిక బరువు నుండి కూడా బయటపడతారు. ఇది మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడేస్తుంది. దీని ద్వారా మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా తగ్గిపోతుంది.
Health Tips: బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల కూడా కేన్సర్ వచ్చే ప్రమాదం ...
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.