చాలామంది అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు. వారు తగ్గాలనుకుంటారు. అలా కాకుండా కొంతమంది చూడడానికి చాలా సన్నగా ఉంటారు. వీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు పెరగాలని కోరుకుంటారు.అయితే ఎంత తిన్న కూడా వారు బరువు పెరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బరువు పెరగడానికి మార్కెట్లో లభించే రకరకాల అయిన వెయిట్ గైన్ పౌడర్లను తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. నేచురల్ పద్ధతిలో మీరు మీ ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకున్నట్లైతే మీరు ఈజీగా బరువు పెరగవచ్చు .ఆ పండ్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పళ్ళు: బరువు పెరగడానికి అందరూ చెప్పే మొదటి పండ్లు అరటిపండు. ఈ అరటిపండులో విటమిన్స్ ,కార్బోహైడ్రేట్లు ,మెగ్నీషియం, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటాయి. ఒక అరటిపండు తీసుకున్నట్లయితే దాదాపు 110 క్యాలరీల వరకు ఉంటాయి. ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా బరువు పెరగడంలో సహాయపడుతుంది. కనుక బరువు పెరగాలనుకుంటున్నవారు ప్రతిరోజు రెండు నుంచి మూడు అరటి పనులు తీసుకున్నట్లయితే మీరు ఈజీగా బరువు పెరుగుతారు.
మామిడి పళ్ళు: కేవలం వేసవికాలంలో వచ్చే ఈ మామిడి పండ్లు మన బరువును పెంచడంలో సహాయపడతాయి. ఇందులో కార్బోహైడ్రేటు, షుగర్ లెవెల్స్, ఎక్కువగా ఉంటాయి, అదే విధంగా ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది 160 నుంచి 180 క్యాలరీలు ఉంటాయి. కనుక మీరు బరువు పెరగాలి అనుకుంటున్నప్పుడు ఈ మామిడి పండ్లను తీసుకున్నట్లయితే ఈజీగా బరువు పెరుగుతారు. ఇది మన జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది.
Health Tips: కలబంద లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ ...
అవకాడో: బరువు పెరగాలని అనుకుంటున్న వారు అవకాడోనీ మీరు మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు. ఇందులో ఉండే మోనోసాచ్యురేటెడ్ ఫ్రాట్స్, విటమిన్స్, పొటాషియం ,సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా అనేక రకాలైన పోషకాలు కూడా ఈ పండు నుంచి లభిస్తాయి. ఒక ఆవకాడలో దాదాపు 350 క్యాలరీ క్యాలరీలు ఉంటాయి. ప్రతిరోజు గనక ఒక ఆవకాడోని తీసుకున్నట్లయితే మీరు బరువు ఈజీగా పెరుగుతారు.
కొబ్బరి: కొబ్బరిల కూడా బరువు పెంచేటువంటి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. ఒక కొబ్బరికాయలో దాదాపు 300 క్యాలరీలో ఉంటాయి. ఈ కొబ్బరిని తీసుకోవడం వల్ల మీరు బరువు ఈజీగా పెరుగుతారు. కొబ్బరితో చేసిన లడ్డులు తీసుకున్నట్లయితే మీరు బరువు ఈజీగా పెరుగుతారు.
డేట్స్: డేట్స్ వల్ల కొరకు ఇనిస్టెంట్ గా శక్తి వస్తుంది. 100 గ్రాముల ఖర్జూరాల్లో దాదాపు 300 క్యాలరీలు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఫైబరు, విటమిన్స్ ,జింక్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది మీరు రెగ్యులర్ గా డేట్స్ మీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఈజీగా బరువు పెరుగుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.