Reprasentative Image (Image: File Pic)

తులసి మొక్క మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతా.రు ఇది ఒక ఆయుర్వేద మొక్క. దీంట్లో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. చాలామంది తులసికులను నేరుగా తింటారు. అలా కాకుండా ప్రతిరోజు దీన్ని టీ చేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి:  తులసిటీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ,యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తులసిటీని ప్రతి రోజు తీసుకున్నట్లయితే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అంతేకాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ,వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.

జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది: తులసిలో జీర్ణ క్రియను మెరుగుపరచడంకి సంబంధించిన అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కడుపుబ్బరము, గ్యాస్, మలబద్ధకం, సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ తులసిటీని ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఎసిడిటీ  సమస్యలు నుండి బయటపడవచ్చు.

బరువు తగ్గడాని: తులసిటీ మనం మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. దాని ద్వారా మనం బరువు కంట్రోల్లో ఉంటుంది. శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడంలో ఈ తులసిటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఈ తులసిటీని తీసుకున్నట్లయితే మీరు త్వరగా బరువు తగ్గుతారు.

Health Tips: గర్భవతులు వంకాయ తినవచ్చా... తింటే ఏమవుతుంది..

ఆందోళన తగ్గిస్తుంది:  తులసిలో సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళన తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి, ఇది ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీకు మానసిక ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది.

పంటి సమస్యలు: చాలామంది చిగుళ్ల వాపుతో, నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు, ప్రతిరోజు నాలుగు తులసాకులను నమ్మడం కానీ లేదా తులసిటీని తీసుకోవడం ద్వారా చిగుళ్ళ ఆరోగ్యం గట్టిపడుతుంది, ఇందులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల మీ చిగుళ్ళకు దృడాన్ని ఇస్తుంది. అదేవిధంగా నోటి దుర్వాసనను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.

టాక్సిన్స్ ను బయటికి పంపిస్తుంది: తులసిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలను, కాలయాన్ని శుభ్రపరచడంలో కూడా ఈ తులసిటి చాలా సహకరిస్తుంది, దీని ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీకు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

శ్వాసకోశ జబ్బులు: తులసిటీని తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో వచ్చే అనేక రకాలైన ఇన్ఫెక్షన్ల నుండి బయటపడేస్తుంది. చాలామంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడతారు శ్వాసకోశ సంబంధ వ్యాధులను కూడా తగ్గించడంలో ఈ తులసిటి అనేది సహాయపడుతుంది.

తులసిటీ తయారు చేసుకునే విధానం.

ఐదు నుండి పది తాజా తులసాకులను తీసుకొని వాటిని ఒక కప్పు నీటిలో మరిగించండి. తర్వాత కాసేపు చల్లారనిచ్చిన తర్వాత దాన్ని వడపోసుకొని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే మీ శరీరంలో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.