మన చుట్టుపక్కల ఉండే మొక్కల్లో కూడా ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదవి తమలపాకు. తమలపాకులో ఆయుర్వేద ఔషధ గుణాలు చాలా అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి బయట పడేయడంలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తమలపాకు లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి బయట పడేస్తాయి. తమలపాకులను ప్రతిరోజు మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచి జబ్బుల బారి నుండి బయట పడేస్తాయి. తమలపాకును ప్రతిరోజు మీరు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పి, దగ్గు, వంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. చిన్న పిల్లల్లో జలుబుతో దగ్గుతో బాధపడేవారు ఈ తమలపాకును వేడి చేసి చాతి మీద పెట్టినట్లయితే వాళ్ళ జలుబు, దగ్గు తొందరగా తగ్గిపోతుంది. అంతే కాకుండా తమలపాకుల తీసుకొని వాటికి కొంచెం వేడి చేసి నువ్వుల నూనె రాసి పాదాలకు పెట్టినట్లయితే జ్వరము, జలుబు ,దగ్గు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ వర్షాకాలంలో వచ్చే అనాయక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల భారి నుండి బయటపడేయడంలో ఈ తమలపాకు సహకరిస్తుంది.
Health Tips: ఈ 7 కారకాలు క్యాన్సర్ లక్షణాలను పెంచుతాయి.
అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య నుంచి కూడా బయటపడతారు. అదే విధంగా జీర్ణ సంబంధ సమస్యలు, కడుపునొప్పి ,అజీర్ణం వంటి సమస్యలతో బాధపడే వారు కూడా రోజు ఒక తమలపాకును తిన్నట్లయితే మీకు జీర్ణ సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.