ladyfinger

మనందరికీ బెండకాయ తెలుసు దీన్ని కేవలం మనము కూరలాగే చేసుకుంటాం. కానీ ఈ బెండకాయ నీరు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు బెండకాయ నీరు ఏంటి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ బెండకాయ నీరు వల్ల ఎటువంటి జబ్బులు తగ్గుతాయో తెలుసుకుందాం.

షుగర్ : బెండకాయ నీరుతో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. బెండకాయలు యాంటీ  డయాబెటిక్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా బెండకాయలు అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఈ బెండకాయ నీరుని మీరు ప్రతి రోజు ఒకసారి తీసుకున్నట్లయితే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

కొలెస్ట్రాల్ : బెండకాయ నీరుతో కొలెస్ట్రాల్ జబ్బులు కూడా తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ వల్ల హాట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి .అంతేకాకుండా హార్ట్ ఎటాక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెండకాయ నీరును మీరు ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా తగ్గించే గుణం ఈ బెండకాయ నీరుకు ఉంది. దీన్ని మీరు తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్లో తగ్గించుకోవచ్చు.

బీపీని తగ్గించడానికి: బీపీని తగ్గించడానికి కూడా ఈ బెండకాయ నీరు చాలా బాగా సహకరిస్తుంది. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండడం ద్వారా  బీపీని ఇది కంట్రోల్ చేస్తుంది. తద్వారా గుండెపోటు సమస్యలనుంచి కూడా బయటపడేస్తుంది.

ఆస్తమా: ఆస్తమా సమస్యతో బాధపడేవారు ఈ బెండకాయ నీరును తీసుకున్నట్లయితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

Health Tips: బెల్లి ఫ్యాట్.. సింపుల్‌గా ఇంట్లోనే ఉండి ఇలా తగ్గించుకోండి

రక్తహీనత : చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. అటువంటివారు బెండకాయ నీరును తీసుకుంటే మీ శరీరంలో రక్త వృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఎనిమిది సంబంధించిన సమస్యలు అలసట కళ్ళు తిరగడము నీరసం అంటే సమస్యల నుంచి కూడా దూరం చేస్తుంది.

రోగనిరోధక శక్తి : వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు అంటే సమస్యల్ని తగ్గించడానికి ఈ బెండకాయ నీరు అనేది సహకరిస్తుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. దీని ద్వారా మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీంతో ఈ వర్షాకాలంలో వచ్చే రకరకాలైన ఇన్ఫెక్షన్ భారీ నుండి బయట పడడంలో ఈ బెండకాయ నీరు అనేది సహకరిస్తుంది.

బెండకాయ నీరును ఎలా తయారు చేసుకోవాలి.

బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రాత్రిపూట ఒక నీళ్లు పోసి గిన్నెలో వేసుకోవాలి ఉదయాన్నే ఆ ముక్కలు తీసేసి ఉన్న వాటర్ ని మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఆ బెండకాయల ఉన్న పోషకాలు అన్నీ కూడా ఆ వాటర్ లోకి వస్తాయి. ఈ వాటర్ ని మీరు ప్రతి రోజు తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య సమస్య నుంచి బయట పడేస్తుంది.

 Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.