Pregnant (File: Istock)

Newdelhi, Oct 21: ప్రెగ్నెన్సీ (Pregnancy) సమయంలో విపరీతంగా బరువు పెరిగితే.. తదనంతర కాలంలో ఆ మహిళ మధుమేహం, గుండెజబ్బులతో (Heart Diseases) మరణించే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. లాన్సెట్‌ (Lancet) జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం, అమెరికాలో 45 వేల మంది మహిళలకు సంబంధించిన 50 ఏండ్ల డాటాను సైంటిస్టులు విశ్లేషించారు. ప్రెగ్నెన్సీ సమయంలో అనూహ్యంగా అధిక బరువు పెరిగినవారికి తదనంతర కాలంలో గుండెపోటు, మధుమేహం తలెత్తుతున్నట్టు వారు గుర్తించారు.

Gaganyaan Postponed: గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??

బరువు పరిమితి ఇది

అమెరికా సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.. తక్కువ బరువున్న మహిళ ప్రెగ్నెన్సీ సమయంలో 12.5 నుంచి 18 కిలోల వరకు, ఊబకాయంతో ఉంటే 5 నుంచి 10 కిలోల వరకు బరువు పెరగవచ్చు. బరువు అదుపులో ఉంటే తల్లికి, నవజాత శిశువుకు ఇద్దరికీ మేలని పరిశోధకులు తెలిపారు.

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ