Representational Image (Photo Credits: ANI)

ఇప్పుడు ఏ ఇంట చూసినా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఒక్కరైనా ఉంటున్నారు. మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి అంటే పాంక్రియాస్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి వల్ల మధుమేహ సమస్య ఇప్పుడు ఎక్కువ అవుతోంది. దీనికి మన ఇంట్లోనే మంచి మందు ఉందంటున్నారు నిపుణులు. బిర్యానీకి అంత మంచి వాసన కలిగించే వాటిలో దాల్చిన చెక్క ఒకటి. బిర్యానీ ఎక్కువగా తింటే సమస్య అవుతుందేమో గానీ దానిలో వాడే దాల్చిన చెక్క మాత్రం మధుమేహ రోగులకు మాత్రం వరమే.

ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే, రాష్ట్ర చరిత్రలో రోడ్లకు ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదని తెలిపిన ఏపీ సీఎం జగన్, విశాఖ బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైదిగా నిలిచేలా ప్లాన్ రూపకల్పన

మన వంటల్లో వాడే దాల్చిన చెక్కకు మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉందట. గుండెజబ్బుల రిస్కు కూడా తగ్గిస్తుందట. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది. దీనిలో ఉండే యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు మధుమేహం వల్ల వచ్చే సమస్యలైన బీపీ, గుండెజబ్బుల రిస్కు తగ్గడానికి సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లకు దాల్చిన చెక్క సప్లిమెంట్లు రోజుకి 120 మి.గ్రా. నుంచి 600 మి.గ్రా.లను 16 వారాల పాటు ఇచ్చినప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గిందట. అందుకే రోజుకో చిన్న దాల్చిన చెక్క ముక్కను నోట్లో వేసుకోండి.