Credit@ google

నెయ్యి కాఫీ అనే పేరు వినడానికి వింతగా అనిపిస్తుంది కదూ.. అయితే ప్రస్తుతం ఈ కాఫీ బాగా ట్రెండ్ అవుతోంది.చాలా మంది సినీనటులు ఈ ఘీ కాఫీ తాగడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు.అయితే చలికాలంలో ఘీ కాఫీని తీసుకోవడం ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. చలికాలంలో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, మెరుగైన జీవనశైలిని పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే నెయ్యిని ఆహారంలో ఏదో ఒక సమయంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు.అయితే రోజువారీ కెఫీన్ ను పరిమితమైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యాభిలాషులకు ఘీ కాఫీ చాలా మేలు చేస్తుందని తెలుస్తుంది.

ఈ కాఫీ తో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని శాస్త్రీయ ఆదారాలు కూడా వచ్చాయి.రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి పలువురు సెలబ్రిటీలు ఘీ కాఫీని తమ డైట్ లో చేర్చుకున్నారు. ప్రధానంగా నెయ్యిలో ఉండే ఆరోగ్యకర కొవ్వులు ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ను కలుగచేయడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను మెరుగ్గా తగ్గించుకుంటు వస్తుంది. రోజులో ఎక్కువసేపు ఉత్సాహంగా ఉండేలా ఈ ఘీ కాఫీ సహాయపడుతుంది..

Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో బాత్ రూమ్ ఏ దిశలో ఉండాలో తెలుసా ...

కాఫీలో ఘీ కలపడం ద్వారా కేఫీన్ ను గ్రహించడం నెమ్మదించేలా చేస్తుంది. ఫ్యాట్స్ తో కలిపి కేఫీన్ ను తీసుకుంటే దాని నుండి వచ్చే శక్తి నిదానంగా విడుదల అయ్యేందుకు దారి తీస్తుందని జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అధ్యయనం వాళ్లు వెల్లడించారు. అదే విధంగా కాఫీతో ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్ నుంచి కూడా ఘీ కాఫీ ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నెయ్యిని వాడటం వల్ల జీర్ణక్రియ మెరుగై కడుపుబ్బరం వంటి సమస్యలను నివారించవచ్చని జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనం స్పష్టం చేసింది.