Hyderabad, Jan 20: దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకా (Hepatitis-A vaccine) హవిష్యూర్ ను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్-IIL) ఆవిష్కరించింది. ‘క్లినికల్ పరీక్షల్లో ఈ టీకా సురక్షితం, సమర్థవంతమైనదిగా నిరూపితమైంది’ అని ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్ తెలిపారు. బహుళజాతి సంస్థల టీకాలతో దీన్ని పోల్చి చూడొచ్చన్నారు.
Indian Immunologicals unveils indigenously developed Hepatitis A vaccine
MRP set at ₹2,100 per shot for the two-dose Havisure that has been launched after years of R&D, extensive clinical trials as well as a non-inferiority study, says MD K Anand Kumarhttps://t.co/WPnlwN7vzh
— The Hindu-Hyderabad (@THHyderabad) January 19, 2024
ధర ఎంత?
ఏడాదికి పైగా వయసున్నవారు హవిష్యూర్ మొదటి డోసును తీసుకోవచ్చు. మొదటి డోసు తీసుకొన్న ఆరు నెలల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. ఒక్కో డోసు ధర ₹2,100. కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా హెపటైటిస్ వ్యాపిస్తుంది.