New Delhi, Jan 4: భారతదేశం 2019లో సుమారు 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9.3 లక్షల మరణాలను (Cancer Deaths in india) నమోదు చేసింది, అధిక కేసులు, మరణాల సంఖ్య నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ఆసియాలో రెండో స్థానంలో (second highest in Asia) ఉన్నదని తాజా అధ్యయనం తెలిపింది. లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం. కొత్త కేసులు, మరణాల సంఖ్య పరంగా ఆసియాలో చైనా, జపాన్‌లతో పాటు భారతదేశం మూడు అగ్రగామి దేశాలలో ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
ఆసియాలో 94 లక్షల కొత్త కేసులు, 56 లక్షల మరణాలతో క్యాన్సర్ మరింత ముఖ్యమైన ప్రజారోగ్య ముప్పుగా మారిందని వారు చెప్పారు. వీటిలో, చైనా 48 లక్షల కొత్త కేసులు, 27 లక్షల మరణాలతో అత్యధికంగా ఉండగా, జపాన్‌లో 9 లక్షల కొత్త కేసులు, 4.4 లక్షల మరణాలు నమోదయ్యాయి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌తో సహా అంతర్జాతీయ పరిశోధకుల బృందం, సైన్సెస్ (AIIMS), జోధ్‌పూర్ బటిండా వంటి వారు ఈ పరిశోధనలో భాగస్వాములుగా ఉన్నారు.
ఎండుకొబ్బరి తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ప్రతి రోజు తింటారు..
ఈ పరిశోధకుల బృందం 1990 నుంచి 2019 మధ్య 49 ఆసియా దేశాల్లోని 29 రకాల క్యాన్సర్ తీరుతెన్నులపై పరిశీలన చేశారని పరిశోధకులు అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. ఆసియాలో టీబీఎల్(శ్వాసనాళం, ఊపిరితిత్తుల సంబంధిత) క్యాన్సర్ ప్రభావం అధికంగా ఉన్నదని, 13 లక్షల కొత్త కేసులు, 12 లక్షలు మరణాలు నమోదయ్యాయని వివరించారు.
Vastu Tips: గోడ గడియారం విషయంలో ఈ తప్పులు చేశారో మీ బ్యాడ్ టైం ...
టీబీఎల్ క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా ఉన్నదని, మహిళల్లో గర్భాశయ సంబంధిత క్యాన్సర్ ముప్పు అధికంగా ఉన్నదని పేర్కొన్నారు. మొత్తంగా అసియాలో టాప్-5 క్యాన్సర్ల జాబితాలో టీబీఎల్, రొమ్ము క్యాన్సర్, సీఆర్సీ, పొట్ట సంబంధిత క్యాన్సర్, నాన్ మెలనోమా క్యాన్సర్ ఉన్నాయి. క్యాన్సర్‌కు కారణమయ్యే 34 రిస్క్ ఫ్యాక్టర్లలో పొగ, మద్యం తాగడం, కాలుష్యం ప్రధానంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
ఆసియాలో టాప్ త్రీలో ఉన్న దేశాల కొత్త కేసులు, మరణాలు
చైనా ; 48 లక్షలు ;27 లక్షలు
భారత్ ; 12 లక్షలు ; 9.3 లక్షలు
జపాన్ ; 9 లక్షలు ; 4.4 లక్షలు