రణపాల మొక్క ఔషధాల గని. ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మనకు నర్సరీలలో లభిస్తుంది. దీని ఆకులు, కాండము, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. ఈ రణపాల మొక్కలు ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,గుణాలు ఉంటాయి. ఇది మన తరచుగా వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రణపాల ఆకును డైరెక్ట్ గా తినవచ్చు లేదా కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ ఆకులను పేస్ట్ గా చేసుకొని మనకు దెబ్బలు తగిలిన చోట గాయాలు తగిలిన చోట ఈ పేస్టును రాసుకున్నట్లయితే గాయాలు తొందరగా మానుతాయి. రణపాల ఆకుల్లో బీపీని తగ్గించే ఔషధ గుణం కూడా ఉంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు. ఈ రణపాల ఆకుల కషాయాన్ని గనక తీసుకున్నట్లయితే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
షుగర్: షుగర్ పేషెంట్స్ కూడా ఈ రణపాల కషాయం సహకరిస్తుంది. ఇది మీ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను కషాయంగా చేసుకొని తింటే మీ క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి కిడ్నీ స్టోన్స్ సమస్య కూడా తగ్గిపోతాయి.
జీర్ణశయ్య సమస్యలు: జీర్ణశయ్య సమస్యలతో బాధపడేవారు కడుపులో అల్సర్లు, అజీర్ణం, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు ఈ రణపాల ఆకుల కషాయాన్ని తీసుకున్నట్లయితే మీ జీర్ణాశయ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి.
Health Tips: పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ...
మైగ్రేన్ : చాలామంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ ఆకులను పేస్ట్ గా చేసుకొని తల పైన పట్టి లాగా పెట్టుకున్నట్లయితే మీ తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.
జుట్టు సమస్య : రణపాల ఆకులను తినడం ద్వారా లేదా కషాయం ద్వారా తీసుకోవడం ద్వారా మీ జుట్టు రాలడము తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా చాలామంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి వారి కాలేయం దెబ్బతింటుంది. అలాంటివారు ఈ రణపాల కషాయాన్ని గనక తీసుకున్నట్లయితే మీ లివరు తిరిగి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపించడంలో ప్రధమ పాత్ర పోషిస్తుంది.
ఇందులో యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నప్పుడు ఉండడం ద్వారా జలుబు, దగ్గు విరోచనాలు వంటి సమస్యను తగ్గించడంలో కూడా ఈ రణపాల కషాయం సహాయపడుతుంది. మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు వచ్చిన వారు ఈ రణపాల కషాయాన్ని తీసుకున్నట్లయితే తొందరగా తగ్గిపోతాయి. మూత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా ఈ రణపాల కషాయాన్ని తీసుకోవడం ద్వారా మేము నూతన సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా కామెర్లవాదితో బాధపడే వారు కూడా ఈ ఆకుల రసాన్ని తీసుకున్నట్లయితే తొందరగా వ్యాధిని నయమవుతుందని ఆయుర్వేద శాస్త్రంలో తెలుపబడింది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.