Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. కంటినిండా నిద్ర పోవడం కూడా అదృష్టం అంటారు కొందరు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్ర లేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. అందువలన కంటి నిండా నిద్రపోవాలి. రోజుకు 7-8 గంటల సేపు రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చాలామందికి వివిధ కారణాలతో రాత్రిళ్లు త్వరగా నిద్రపట్టదు. కొంత మంది నిద్ర పోదామని ఎంత ప్రయత్నించినా నిద్రరాదు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఇలా నిద్ర లేమితో బాధ పడుతున్న వారికోసమే ఈ చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే తప్పనిసరిగా కంటినిండా నిద్రపోయి, ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు.

>> రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు, మిరియాల పౌడర్ కలుపుకుని తాగాలి దీనివలన మంచిగా నిద్రపడుతోంది.

>> రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకుని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి, ఇలా చేస్తా కచ్చితంగా నిద్ర పట్టే అవకాశాలున్నాయి.

>> రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దనా చేసుకున్నా నిద్ర పడుతుంది.

>> నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. అంతేకాదు రాత్రిళ్లు తల పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావంతో కూడా సరిగ్గా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ ఫోన్‌ను దూరంగా పెట్టడం చాలా మంచిది.