సీజన్ల తో పనిలేకుండా మనకు ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యల్లో దగ్గు ఒకటి. మీకు రాత్రిపూట వచ్చే దగ్గు వలన ఇబ్బంది పడుతున్నారా.. అసలు పొడిదగ్గు రాత్రిపూటనే ఎందుకు వస్తుంది అని మీలో ఎవరికైనా సందేహం వచ్చిందా.. పొడి దగ్గు రావద్దు అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు తాజాగా వెల్లడించారు అవి ఏంటో తెలుసుకుందామా..
మన నిత్య జీవితంలో వాతావరణ మార్పులు కారణంగా జలుబు దగ్గు అనేవి సర్వసాధారణమే.. అయితే దగ్గు, జలుబు సమస్యలు ఒకరి నుంచి ఇంకొకరికి వెంటనే సోకుతాయి. అయితే పొడి దగ్గు సమస్య మాత్రం చాలా ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది.ఈ దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పలు చిట్కాలు ఉన్నాయి.
అర టీస్పూను శొంఠి లో చిటికెడు ఏలకుల పొడి కలపాలి. ఆ తర్వాత దాంట్లో ఒక టీస్పూను తేనే లో కలుపుకొని తింటే పొడి దగ్గు తగ్గుతుంది. అలాగే అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనే కలిపి తీసుకుంటే దగ్గు తగ్గడానికి అవకాశాలు కనిపిస్తాయి. అదేవిధంగా అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం పావు టీస్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి.ఇలా తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
రోజుకు 12 గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారా, అయితే ఈ జబ్బులు మీ దగ్గరకు వచ్చినట్లే..
ఇంకా జీలకర్ర, కలకండను నమిలి తింటే కూడా దగ్గు నయం అవుతుంది.4 మిరియాలు, 5 దాల్చిన చెక్కల్ని నెయ్యిలో వేపి పొడిచేసి వాటిని ఓ తమలపాకులో పెట్టి తింటే కూడా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలాగే మిరియాలు, బెల్లాన్ని రోజు కొంచెం పరిగడపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని పీల్చడం వలన పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.అలాగే తులసి ఆకులను వేడి నీటిలో బాగా మరిగించి తాగడం వలన దగ్గును తగ్గించుకోవచ్చు