Benefits of Drinking Water (Photo Credits: PxHere)

నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా?అసలు డాక్టర్లు ఏమంటున్నారు.. నిద్రపోవడానికి ముందు నీళ్లు తాగడం చాలామందికి అలవాటే. అయితే అలా రాత్రిపూట నీళ్లు తాగడం మంచిదా? కాదా? అని మీలో సందేహం వస్తుందా.. కొందరికి పగటిపూట ఉన్న దాహం కన్నా రాత్రిపూట ఉండే దాహం ఎక్కువ. అలాగే మరికొందరు నిద్రపోయే ముందు నీళ్లు తాగడానికి ఇష్టపడతారు.

నిద్రపోయే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరానికి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.ప్రతిరోజంతా మనం ఎన్నో పనులు చేస్తుంటాం. కాబట్టి మన శరీరం, కండరాలు చాలా శ్రమ పడతాయి. దీనివల్ల శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది. దీన్ని ఫలితంగా మనలో నీటి శాతం అనేది తగ్గుతుంది.అలాగే నిద్రలేకపోవడం వల్ల, శరీరం అలసటకు, అసౌకర్యానికి గురి చేస్తుంది.

రోజుకు 12 గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారా, అయితే ఈ జబ్బులు మీ దగ్గరకు వచ్చినట్లే..

ఇక రాత్రిపూట నిద్రకు ముందు నీళ్లు తాగడం అనేది ఒక్కొక్కరి శరీరతత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నీటిని కాకుండా శరీరం హైడ్రేటెడ్‎గా ఉండేందుకు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. రాత్రిపూట ఎక్కువ కారం లేదంటే ఎక్కువ తీపి, మసాలా ఉండే ఆహారాలు తగ్గించుకోవడం వల్ల ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం ఏర్పడదు.

పడుకునే ముందు నీళ్ల తాగడం వల్ల కలిగే లాభాలు

సాధారణంగా పగటిపూట మన శరీరం నీటిని కోల్పోతుంది. బాడీ తగినంత హైడ్రేటెడ్‎గా ఉండకపోవడం వల్ల అసౌకర్యానికి లోనవుతాము. దీంతో మీ నిద్ర దెబ్బతింటుంది. అయితే నిద్రపోయే ముందు నీళ్లు తాగడం వల్ల హైడ్రేషన్ సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది. దీంతో మీ నిద్ర సమస్య కూడా తీరిపోతుంది.

పగటి పూట చేసే వ్యాయామం, వివిధ రకాల పనుల వల్ల మీ కండరాల మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగి పడుకుంటే కండరాలకు మేలు కలుగుతుంది. రాత్రి తాగే నీళ్లు అవి పునరుద్ధరణకు గురయ్యేలా చేస్తాయి. ఫలితంగా మరుసటి రోజు హుషారుగా ఉండటానికి వీలవుతుంది.మనం నిద్రలోకి జారుకున్న వెంటనే సహజంగానే మన శరీర ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అయితే నిద్రపోయే ముందు నీళ్లు తాగడం శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట మీ నిద్రకు భంగం కలిగించే ఓవర్ హీటింగ్‎ను కూడా అరికడుతుంది.

పంది గుండె అమర్చిన 40 రోజులకే మరో వ్యక్తి మృతి, ఫాసెట్ రోగనిరోధక వ్యవస్థను ఈ గుండె తిరస్కరించడమే కారణమని తెలిపిన వైద్యులు

డీహైడ్రేషన్​ అనేది పొడి గొంతు, ముక్కు సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తుంది. ఫలితంగా గురక పెడతారు. ఇది తేలికపాటి స్లీప్ ఆప్నియాకు దారితీస్తుంది. అలాంటి సమయాల్లో రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగి పడుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.నిద్రకు ముందు ఒక కప్ వేడి వేడి హెర్బల్ టీ లేదా గ్లాస్ మంచినీళ్లు తాగడం మీ శరీరంపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ అలవాటు వల్ల ఇది విశ్రాంతి తీసుకునే సమయం అని మీ శరీరానికి సిగ్నల్స్​ అందుతాయి. ఇది మీ విశ్రాంతిని మెరుగుపరిచి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.

పడుకునే ముందు నీళ్ల తాగడం వల్ల కలిగే నష్టాలు:

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ఉండే ప్రధాన ఇబ్బందుల్లో మూత్రవిసర్జన ఒకటి. ఇందుకోసం నిద్రలేవడాన్నే మెడికల్ పరిభాషలో నోక్టురియా అంటారు. ఇలా నిద్ర సమయంలో బాత్రూమ్‎కు వెళ్లాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఫలితంగా నిద్ర సరిపోక నీరసంగా అనిపిస్తుంటుంది.

రాత్రిపూట నీళ్లు తాగే అలవాటున్న కొంతమందిలో గుండెల్లో మంట కలిగిన భావన రావచ్చు. పడుకునేటప్పుడు అడ్డంగా పడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ సులువుగా అన్నవాహికలోకి వెనక్కి ప్రవహించవచ్చు. దీని వల్ల మీరు అసౌకర్యానికి గురవుతారు. ఫలితంగా ఇది మీ నిద్రను డిస్టర్బ్​ చేస్తుంది.

హైడ్రేటెడ్​గా ఉండటం కోసం కొంతమంది రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. దీని వల్ల సమస్యలు తలెత్తుతాయి. శరీరంలోకి చేరిన అధిక ద్రవాలను ప్రాసెస్ చేయడానికి శరీరంలోని వివిధ అవయవాలు పని చేయాల్సి వస్తుంది. రాత్రిపూట నిద్రకు, విశ్రాంతికి ఇది అవాంతరం కలిగిస్తుంది.

స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారు పడుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగితే పలు ఇబ్బందులకు గురికావచ్చు. ఎక్కువ మోతాదులో తీసుకునే నీళ్ల వల్ల శ్వాస మార్గాలు ఉబ్బరాన్ని కల్గించవచ్చు. ఫలితంగా నిద్రలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారవచ్చు. నిద్రకు ముందు నీళ్లు తాగడం వల్ల మూత్రాశయం నిండిన భావన కలగవచ్చు. దీని వల్ల తరచూ బాత్రూమ్‎కు వెళ్లాల్సి వస్తుంది. ఇది మీ నిద్రను పాడు చేస్తుంది.