Newdelhi, July 12: ఆధునిక జీవనశైలి (Life Style), ఆహారపుటలవాట్లలో మార్పులతో నేటికాలంలో గుండెజబ్బులు (Heart Attacks) తీవ్రమయ్యాయి. దేశంలో ఏటా 30 వేల మంది గుండెపోటుకు బలవుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గుండెపోటును ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాలరేటు ఎక్కువవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని శరీరంలో వచ్చే ఆరు మార్పులతో నెల ముందుగానే పసిగట్టవచ్చని ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజాగా వెల్లడించింది. కింద పేర్కొన్న సంకేతాలను బట్టి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మరణాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆరు హెచ్చరికలు ఇవి..
- ఛాతీ మధ్యలో ఒత్తిడి
- తల తిరగడం
- ఊపిరి ఆడకపోవడం
- మిగతా శరీర భాగాల్లో నొప్పి
- వికారం, అజీర్ణం
- విపరీతంగా చెమటపోయడం