పగటి పూట అతిగా నిద్రపోతే డయాబెటిస్, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉన్నదని తాజా పరిశోధనలో వెల్లడైంది. నగర వాసుల జీవనశైలి, నిద్ర వేళలపై బోస్టన్ పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ (Obesity journal) తాజాగా ప్రచురించింది. బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్, ఉమెన్స్ ఆస్పత్రి పరిశోధకులు 3,000 మందికి పైగా వ్యక్తుల జీవనశైలిపై అధ్యయనం చేశారు.
ఈ అధ్యయంనలో ప్రధానంగా ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య సంబంధాన్ని పరిశోధించారు. మధ్యాహ్నం అరగంట కంటే ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు (Daytime Sleepiness) ఉన్నవారిలో అనేక రకాలైన రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఈ అధ్యయనంలో తేలింది. నిద్రావస్థలో ఉన్నప్పుడు జీవక్రియలు మందగించటంతో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉన్నదని అధ్యయనం తెలిపింది.
నిత్యం 25-30 నిమిషాల కంటే ఎక్కువ కునుకు తీసే అలవాటు ఉంటే… ఇబ్బందులు తప్పవని పరిశోధనలు చెబుతున్నాయి.లంచ్ తర్వాత కాసేపు నిద్రపోయే అలవాటు ఇతర దీర్ఘకాలిక రోగాలను ఆహ్వానిస్తున్నదని పరిశోధకులు చెప్తున్నారు.
ఈ మందులతో జాగ్రత్త, మెడికల్ క్వాలిటీ టెస్ట్‌లో 48 రకాల మందులు విఫలమైనట్లు తెలిపిన CDSCO
రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోయే అలవాటు ఉన్న వారి కంటే మధ్యాహ్నాం పూట అరగంటకు మించి నిద్రపోయిన వారి గుండె పనితీరులో భారీ వ్యత్యాసం ఉండగా, బరువు కూడా వేగంగా పెరిగినట్టు అధ్యయనంలో తేలింది.