ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య గురక. నిదరలో తెలియకుండానే గురకలు పెడుతూ నిదరపోతుంటారు. అయితే వారికి అది తెలియకపోయినా పక్కవారు మాత్రం గురకతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక భార్యా భర్తలయితే గురక దెబ్బకు ఫైటింగ్ చేసుకున్న వార్తలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ స్టోరీలో ఫైటింగ్ కాకుండా కొత్తగా ఆలోచించాడు లవర్ బాయ్ ఫ్రెండ్..
వివరాల్లోకెళ్తే.. 22 ఏళ్ల జాన్ అబ్రహం తన లవర్ షార్ని బ్రైట్‌తో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమెకు నిద్రలో గురకపెట్టే సమస్య ఉండటంతో జాసన్ అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. ప్రియురాలు గురక పెట్టకుండా.. ఆ సమయంలో తనను నిద్ర నుంచి లేపకుండా గురక తగ్గించడానికి ఎన్నో ప్రయోగాలు (Snoring Treatment) చేసేవాడు. ఈ క్రమంలోనే ఒక ప్రయోగం సూపర్ సక్సెస్ (Boyfriend uses bizarre hack) అయ్యింది. అదేంటంటే.. ప్రియురాలు గురక పెట్టే సమయంలో జాసన్ ఆమె ముఖాన్ని (Man licks) నాకేవాడు. దీంతో ఆమె గురకపెట్టడం ఆపేది.
ఇలా వారం రోజులపాటు ఇదే పద్ధతిని కొనసాగించాడు. దీంతో క్రమంగా ఆమె గురక తగ్గిపోయింది. దీంతో ఈ ప్రేమజంట ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తర్వాత ఒక సందర్భంలో తన ప్రియురాలికి తను పడుతున్న కష్టాల్ని తెలియజేయగా.. లవర్ షార్ని బ్రైట్ షాకైంది. అయితే వెంటనే షార్ని బ్రైట్ తన ప్రియుడ్ని ఈ ప్రయోగం మళ్లీ చేస్తావా అని అంటే జాసన్ నో కామెంట్ అంటూ సమాధానమిస్తున్నాడు. అయితే ఈ నాకడంపై లవర్ గమ్మత్తుగా కామెంట్ పెట్టింది. కొన్ని సార్లు లేచిన తరువాత నా మొహం జిగటగా ఉండేదని చిలిపిగా అతనికి బదులిచ్చింది.