Coriander Health Benefits: రోజూ కొత్తిమీర తినడం వల్ల ఎన్నోప్రయోజనాలు, మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు, పొట్టకు మేలుచేసే కొత్తిమీర ఉపయోగాలు మీకోసం
Green Coriander (Photo Credits: Pixabay)

ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. ఇది మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు.అంతేకాక కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు. కొత్తిమీర ఆకులను సూప్స్, కూరల వంటి వాటికి చేర్చుతుంటారు. దీని శాస్త్రీయ నామము " Coriandrum sativum " . ఆహార పదార్దాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరపాటే .మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు ,కాయగూరల వంటకాలలో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమిర నిండా విటమిన్లు ,ఖనిజ లవణాలు ఉన్నాయి . అంతేకాదు సమృద్ధి గా ఐరన్ కుడా లభిస్తుంది .

కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం (Health Benefits of Coriander) ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు. కొసమెరుపేమిటంటే, సాధారణంగా ఫుడ్ పాయినింగ్‌లో జెంటామైసిన్ వాడుతుంటారు. అయితే దీనికన్నా కొత్తిమీర ప్రభావవంతంగా, సురక్షితంగా పనిచేసినట్లు రుజువయ్యింది.

చలికాలంలో జలుబును తరిమికొట్టాలంటే వెల్లుల్లి పాలు తాగాల్సిందే, గార్లిక్ మిల్క్ తయారీ విదానం, వెల్లుల్లి ఉపయోగాలు ఓ సారి చూద్దాం

కొత్తిమీర ఆకులలో థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, సోడియం, పొటాషియం, ఆక్సాలిక్ యాసిడ్ వంటి వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా (Surprising Health Benefits of Coriander) ఉన్నాయి. కొత్తిమీర ఆకులను రోజూ తింటే శరీరం మెరుగై రక్తాన్ని శుభ్రపరుస్తుంది. కొత్తిమీరను నూరి కడిగి ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా తింటే సన్నటి శరీర బలం వస్తుంది. కొత్తిమీర తింటే దంత వ్యాధులు, కంటి జబ్బులు నయమవుతాయి. రక్తం శుభ్రపడి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. న్యూరాస్తీనియా నుండి ఉపశమనం కలిగిస్తుంది. నాసికా సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది, పొగతాగడం , కేమోతెరఫి వల్ల కలిగే నష్టము తగ్గించడానికి పోరాడుతుంది, కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది, రక్తనలలలో ఆటంకాలను తొలగిస్తుంది

ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

పిత్త వాంతులను నియంత్రిస్తుంది. కొత్తిమీర నోటి పుండ్లు, నోటి దుర్వాసనకు కొత్తిమీర చెక్ పెడుతుంది. కొత్తిమీరను రెగ్యులర్‌గా తింటుంటే జీర్ణ సమస్యలను కూడా సరిచేస్తుంది. స్త్రీలలో వచ్చే కొన్ని రుతుక్రమ సమస్యలకు కూడా కొత్తిమీర మేలు చేస్తుంది. ఈ కొత్తిమీర తింటే రక్తహీనత వంటి వ్యాధులు మన దరి చేరవు. కొత్తిమీర రసం తాగితే పొట్ట శుభ్రపడుతుంది. కడుపులో వచ్చే క్యాన్సర్‌ను తొలిదశలో చంపే శక్తి కూడా దీనికి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి ఎర్రగా వేయించిన ఎర్రమట్టికి కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే మొలలు ఎండిపోయి నొప్పి, దురదలనుంచి ఉపశమనం లభిస్తుంది. తాజాగా కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి, రసం పిండి, పంచదార కలుపుకొని తాగితే బహిష్టుస్రావం ఎక్కువగా కావటం, ఆర్శమొలలనుంచి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గుతాయి. విటమిన్ల లోపం ఉన్నవారు కొత్తిమీరను చట్నీగా చేసుకొని తినాలి. లేదా ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు తాజాగా తీసిన కొత్తిమీర రసానికి చెంచాడు తేనె కలుపుకొని తాగుతుండాలి. దీనిని క్రమంతప్పకుండా తీసుకుంటే విటమిన్-ఏ, విటమిన్-బి1, విటమిన్-బి6, విటమిన్-సి, లోహం వంటి పదార్థాల లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఈ ఆహార చికిత్స క్షయవ్యాధి, ఉబ్బసం, ఎలర్జీలు, మెదడు బలహీనత, కళ్ల బలహీనత వంటి సమస్యల్లో బాగా పనిచేస్తుంది.

ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం

కొత్తిమీర రసాన్ని తాజాగా తీసి, చెంచాడు రసానికి ఒకటి రెండు అరటి ‘గింజలు’ పొడిని కలిపి రోజుకు ఒకసారి చొప్పున వారంపాటు తీసుకుంటే స్మాల్‌పాక్స్ వంటి పిడకమయ వ్యాధుల్లో నివారణగా సహాయపడుతుంది. స్మాల్‌పాక్స్ వ్యాధి తీవ్రావస్థలో ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని పరిశుభ్రమైన పద్ధతులతో తీసి, రెండు కళ్లలోనూ చుక్కలుగా వేసుకుంటే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి కణతలకు, నుదుటికి పూసుకుంటే తలనొప్పి, ఒంటి కణత నొప్పి వంటివి తగ్గుతాయి.

కొత్తిమీర ఆకులను తాజాగా తెచ్చి, బాగా కడిగి, ముద్దగా నూరి, రసం పిండి, చనుబాలతో కలిపి కళ్లల్లో బిందువులుగా వేసుకుంటే కళ్లమంటలు, కనురెప్పలు అంటుకుపోవటం, కళ్లుమెరమెరలాడటం, కళ్లకలక వంటి సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర ఆకులను, బాదం పలుకులతో ముద్దగా నూరి వాపు, నొప్పి ఉన్నచోట పట్టుగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. దద్దుర్లు కొత్తిమీర ఆకుల రసానికి తగినంత తేనెనూ బాదాం నూనెనూ కలిపి దద్దురు తయారైనచోట పైకి రాసుకోవాలి. అలాగే పంచదార కలిపి లోపలకు తీసుకోవాలి. విష పురుగులు కుడితే కొత్తిమీర ఆకులను ముద్దగా నూరి బాదం పలుకులనూ, పెసర పిండినీ కలిపి స్థానికంగా ప్రయోగిస్తే విషపురుగులు కరిచినచోట తయారైన నొప్పి, వాపులు తగ్గుతాయి.

కొత్తిమీర ఆకుల రసానికి కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే మంటలు తగ్గుతాయి. తాజా కొత్తిమీర రసం స్మాల్‌పాక్స్‌లో నివారణగా పనికి వస్తుంది. దీనిని ఒక చెంచాడు మోతాదులో అరటి పండుతో కలిపి ఏడు రోజులపాటు తీసుకోవాలి. స్మాల్‌పాక్స్‌లో నేత్రాలు దెబ్బతినకుండా కొత్తిమీర రసాన్ని కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. కొత్తిమీర ఆమాశయాన్ని శక్తివంతం చేయటమే కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదరంలో చేరిన గ్యాస్‌ని తగ్గించటంతోపాటు మూత్రాన్ని చేయటం, జ్వరాన్ని తగ్గించటం చేస్తుంది. అలాగే శృంగారానురక్తిని పెంచటం, శ్వాసనాళికల్లో సంచితమైన కఫాన్ని కరిగించి వెలుపలకు వచ్చేలాచేయటం వంటి పనులను కూడా చేస్తుంది. ఉదర కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తుంది.

చిట్కాలు

పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి.కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకొంటాయి.

ఏదైనా కూర వండేటపుడు కాకుండా చివరలో అంటే దించివేసే ముందు వేస్తేనే కూరకు మంచి సువాసన వస్తుంది.

కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే ఓ గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచండి.

మీ ఇంటి వెనుక కాస్త స్థలం ఉందా? ఉంటే కాసిన్ని ధనియాలు చల్లి నీరు చిలకరించండి కొత్తిమీర వస్తుంది.ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా చాలు.