yoga asanas Reprasentative Image (Image: File Pic)

50లో కూడా 30 ఏళ్ల లాగా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా ఈ 5 టిప్స్ పాటించడం వల్ల మీరు ఎప్పటికీ యంగ్ గా ఉంటారు. ప్రతిరోజు కొన్ని రకాల జీవన శైలిలో మార్పులు చేసుకున్నట్లయితే ఎప్పటికీ ఫిట్గా ఉంటారు. వ్యాయామం, ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లయితే కచ్చితంగా మీరు కూడా ఎప్పటికీ యంగ్ గా ఉంటారు. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మితాహారం: మనం ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే ఒకేసారి ఎక్కువగా తినకుండా  కొంచెం కొంచెం గా తీసుకోవాలి. ప్రతి భోజనానికి కూడా 2,3 గంటల గ్యాప్ చొప్పున తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మీరు 50 ఏళ్లలో కూడా 30 ఏళ్ల లాగా యంగ్ గా ఉంటారు.

యోగా చేయండి: చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు. జిమ్ ఒకవేళ మీకు కుదరనట్లయితే ఇంట్లోనే యోగ చేయండి. యోగా వల్ల మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు పోయి చర్మం ఎప్పటికీ ప్రకాశవంతంగా మెరుస్తూ మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. అదేవిధంగా వాకింగ్ కొన్ని రకాలైన ఎక్ససైజ్ చేయడం వల్ల కూడా మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం వంటివి, మీ ఏజ్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోండి.  బ్రౌన్ రైస్ అదేవిధంగా సలాడ్స్ ,కూరగాయలు తీసుకున్నట్లయితే మీరు బరువు పెరగకుండా మీ శరీరాకృతి చాలా అందంగా ఉంటుంది. ప్రోటీన్ కోసం స్టీమ్ చికెన్ స్టీమ్ ఫిష్ ను తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువగా పెరగకుండా మీ బరువు అధికంగా పెరగకుండా అందంగా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా మీరు ఎగ్స్ తీసుకున్నట్లయితే అందులోకి కేవలం తెల్లసొన మాత్రమే తీసుకోండి. అదేవిధంగా బాదంపప్పులను వాల్నట్స్ ని మీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీరు ఎప్పటికీ  యంగ్ గా కనిపిస్తారు.

నీరు త్రాగాలి : శరీరాన్ని ఆరోగ్యంగా హైడ్రేటెడ్ గా ఉంచడానికి నీరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలోని కణాలు ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండాలి అంటే రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగాలి. ఇలా త్రాగడం ద్వారా మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పోయి డీటాక్స్పై చేస్తుంది. ఇది చర్మాన్ని చాలా మృదువుగా చేస్తుంది. మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా అందంగా ఉంచుతుంది. ప్రతిరోజు నీరు తాగడం వల్ల మీరు మీ ఏజ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది.

నిద్ర: తగినంత నిద్ర కూడా మీ ఏజ్ ని కనిపించకుండా చేస్తుంది. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల అదే విధంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా మీరు మీ ఏజ్ ఎక్కువగా పెరగదు. ఎనిమిది గంటల నిద్రపోయినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా త్వరగా ముసలితనం అనేది రాకుండా ఎక్కువగా ఉంచుతుంది. ఈ టిప్స్ పాటించినట్లయితే మీరు 50 లో కూడా 30 ఏళ్ల లాగా యవ్వనంగా కనిపిస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.