Neera and Kallu: కల్లుకు, నీరాకు మధ్య గల తేడాలు ఇవిగో, నీరాను తీసుకుంటే కాళ్ల నొప్పులు ఇట్టే దూరమవుతాయి, కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయంటున్న నిపుణులు

నీరాను సూర్యోదయానికి ముందే తీస్తారు. కాబట్టి ఇందులో ఉండే సహాజ గుణాలైన చక్కెరలు అలాగే ఉంటాయి. కొబ్బరి, ఖర్జూరం, జీలుగు, తాటి, ఈత చెట్లు స్రవించే సిద్ధమైన ద్రవం నీరా.

Neera and Kallu: కల్లుకు, నీరాకు మధ్య గల తేడాలు ఇవిగో, నీరాను తీసుకుంటే కాళ్ల నొప్పులు ఇట్టే దూరమవుతాయి, కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయంటున్న నిపుణులు
Neera and Kallu (Photo-Twitter)

Difference Between Kallu (Palm wine) Neera: చాలా మందికి నీరాకు, కల్లుకు మధ్య వ్యాత్యాసం తెలియదు. రెండూ ఒకటేనని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే రెండింటి మధ్య చాలా తేడా ఉంది. నీరాను సూర్యోదయానికి ముందే తీస్తారు. కాబట్టి ఇందులో ఉండే సహాజ గుణాలైన చక్కెరలు అలాగే ఉంటాయి. కొబ్బరి, ఖర్జూరం, జీలుగు, తాటి, ఈత చెట్లు స్రవించే సిద్ధమైన ద్రవం నీరా.

అయితే కల్లు అలా కాదు. కల్లులో ఆల్కహాల్ ఉంటుంది. వీటిని ఎండ వచ్చిన తర్వాత తీస్తారు. కల్లు కావాలంటే అందులో ఈస్ట్ కలుపుతారు. ఇది ఉష్ణోగ్రతలు పెరిగి పులిసిపోవడంతో కల్లుగా మారుతుంది.దానిని తాగినప్పుడు మత్తుగా ఉంటుంది. అందుకే కల్లును చాలా తక్కువ మంది ఇష్టపడతారు.

ఈ 5 అలవాట్లే గుండెపోటుకు ప్రధాన శత్రువులు, వీటిని కంట్రోల్ చేసుకుంటే మీ గుండె పదిలంగా ఉంటుందని చెబుతున్న నిపుణులు

అయితే రెండింటో ఏది మంచిది అంటే.. నీరా చాలా మంచింది. ఇందులో ఎటువంటి మత్తు పదార్థం ఉండదు. ఇది సహజసిద్ధమైన కొబ్బరి నీళ్లలా ఉంటుంది. నీరాను ఎవరైనా తాగొచ్చు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నీరా ఆరోగ్య ప్రయోజనాలు

ఇది తీసుకుంటే పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎంతో బెనిఫిట్ దక్కుతుంది. ముసలి వారికి కీళ్లు, కాళ్ల నొప్పులు దూరమవుతాయి. మధుమేహాన్ని అదుపు చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రెగ్యులర్ గా తాగితే చర్మ సౌందర్యం పెరుగుతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది. వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్ వంటి వాటిని దూరం చేస్తుంది.

పురుషుల కంటే స్త్రీలకు గుండెపోటు వస్తే చాలా ప్రమాదం, వారు చనిపోయే అవకాశం రెండు రెట్లు ఎక్కువ, కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

నీరాను తీసుకోవడం వల్ల కామెర్లు, టైఫాయిడ్, విరేచనాలు, వాంతులు వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.శ్వాస సమస్యలను తగ్గించడంతో పాటు షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతోంది.రక్తపోటు, గ్యాస్, మలబద్దకం, అజీర్తి అంటివన్నీ తగ్గించి.. వ్యాధి నిరోదక శక్తిని పెంచుతోంది.అంతే కాకుండా దీన్ని షుగర్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు.

ప్రస్తుతం చాలా మందిలో వస్తున్న సమస్య కిడ్నీల్లో రాళ్లు రావడం. దీంతో వైద్యులు నీరా తాగాలని సూచిస్తున్నారు. మన కిడ్నీల్లో ఉండే రాళ్లను తొలగిండంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే నీరాతో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరంలో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలు శ్రమించి రూ.20 కోట్లతో దీన్ని నిర్మించారు. నీరాను పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది.

 

(The above story first appeared on LatestLY on Jun 08, 2023 04:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).