Boiled Egg vs Raw Egg: పచ్చిగుడ్డు మంచిదా, ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యానికి మంచిదా, రెండింట్లో ఏది సరైనదో తెలుసుకోండి..
Egg Challenge, Uttar Pradesh. Image used for representational purpose. | Photo: Pixabay

గుడ్డును ఉడికించి తింటే చాలా ప్రయోజనాలుంటాయి. ఉడికించిన గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ మీరు కండరాలను పెంచడానికి పచ్చి గుడ్లు తాగటానికి ఇబ్బంది పడతుంటుంటే ఇక నుంచి ఉడికించిన గుడ్లను తీసుకోవచ్చు. ఎందుకంటే ఉడికించిన గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. నిజానికి, వండిన గుడ్లు ప్రోటీన్ పంచ్. ఉడికించిన గుడ్డు ప్రోటీన్‌ను విచ్చినం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

పచ్చి గుడ్డు తింటే ప్రమాదం..

గుడ్డు మన శరీరంలోని అన్ని పోషక మూలకాల లోపాన్ని తీరుస్తుంది. మనందరి రోజువారీ ఆహారంలో ఈ సూపర్‌ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది, అయితే ప్రోటీన్, క్యాల్షియం మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో శరీరాన్ని బలపరిచే ఈ గుడ్డు ఆరోగ్యానికి కూడా హానికరం అని మీకు తెలుసా. నిజానికి, పచ్చి గుడ్డు తినడం వల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

పచ్చి గుడ్లలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయి. అందుకే పచ్చి గుడ్లు తినడం మానుకోండి.

Cheetah In India: భారత దేశంలో చిరుతలు అంతరించి పోవడానికి, టీ, కాఫీలకు ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ తింటారు..  

గుడ్లు పచ్చిగా తింటే మన శరీరం సరిగా జీర్ణం చేసుకోలేని కొన్ని పోషకాలు కూడా ఉన్నాయి. అందుకే పచ్చిగా తినడం మానుకోండి.

పచ్చి గుడ్డు కూడా ప్రోటీన్ పరంగా  ప్రయోజనకరంగా ఉండదు. నిజానికి, పచ్చి గుడ్లను తినడం ద్వారా, మన శరీరం గుడ్డులో ఉన్న మొత్తం ప్రోటీన్‌లో 51% మాత్రమే గ్రహించగలదు, అయితే మీ శరీరం ఉడికించినప్పుడు 91% వరకు ప్రోటీన్‌ను పొందుతుంది. పచ్చి గుడ్లు తినడం కూడా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది.