Newdelhi, July 7: ముఖానికి రోజూ పూసుకునే టాల్కం పౌడర్ (Talc Powder) వాడటం వల్ల క్యాన్సర్ (Cancer) వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ) ఈ మేరకు వెల్లడించింది. మనుషుల్లో అండాశయ క్యాన్సర్ కు టాల్కం పౌడర్ కారణమవుతుందని చెప్పడానికి ఆధారాలు పరిమితంగా ఉన్నాయని తెలిపింది. ఎలుకల్లో చేసిన ప్రయోగాల్లో ఈ విషయం తేలినట్టు వెల్లడించింది.
WHO's Cancer Agency Says Talc Powder 'Probably Carcinogenic' for Humans https://t.co/txtTNj08a8 pic.twitter.com/n771vSSnGZ
— Hira Mokariya (@MokariyaHira) July 6, 2024
బలమైన ఆధారాలు
టాల్కం వల్ల మనుషుల కణాల్లో క్యాన్సర్ సంకేతాలకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నాయని, జననాంగాలపై టాల్కం పౌడర్‌ను రాసుకునే మహిళల్లో అండాశయ క్యాన్సర్ రేటు పెరుగుతున్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించినట్టు ఐఏఆర్‌సీ గుర్తు చేసింది.