Why Boozing Can Be Bad for Your Sex Life: మద్యపానం అతిగా చేస్తున్నారా, అయితే మీ మగనతనం అంతరించే చాన్స్, పిల్లలు పుట్టరని తేల్చిన శాస్త్రవేత్తలు
Alcohol | Image used for representational purpose (Photo Credits: IANS)

మద్యపానం ప్రభావం సంతానంపై కూడా పడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, చెట్టినాడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. 231 మంది పురుషులపై పరిశోధన చేయగా.. వారిలో 81 మంది మద్యం తాగేవారు, మిగతా 150 మంది మద్యం అలవాటు లేనివారు ఉన్నారు. వారందరి ఆరోగ్య వివరాలను సేకరించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు వారి వీర్యం, వీర్యకణాలపై పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో మద్యం అలవాటు లేనివారితో పోలిస్తే.. అలవాటు ఉన్నవారి వీర్య కణాలు, వాటి నాణ్యత చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.

హైదరాబాద్‌లో మరో దారుణం, మైనర్ బాలికపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ను విడుదల చేసే వృషణాల్లోని లెడిగ్ కణాలపై మద్యం ప్రభావం చూపడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు. వీర్యం విడుదలకు కారణమయ్యే లూటినైజింగ్ హార్మోన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లపైనా మద్యం ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తద్వారా దాని ప్రభావం సంతానోత్పత్తిపై పడుతోందని తేలింది. నిత్యం మద్యం సేవించే వారిలో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల.. వారికి సంతానం కలగడం లేదని పరిశోధనకులు చెప్తున్నారు.