New Delhi, AUG 06: మైదాపిండి (Maida) దీనిని గోధుమ పిండి నుండి తయారు చేస్తారు. గోధుమ పిండిలో బెంజాయిల్ పెరాక్సైడ్ (benzoyl peroxide) అనే రసాయనంతోపాటు మరికొన్నింటిని కలపటం ద్వారా దీనిని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్ (Bekary Items), స్వీట్లు తయారీలో ఇటీవలి కాలంలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పిండిలో (Flour) ఎలాంటి పోషకాలు లేవని, అంతా రసాయనమేనని నిపుణులు చెబుతున్నారు. బెంజాయిల్ పెరాక్సైడ్ మాత్రమే కాకుండా ప్రమాదకరమైన రసాయనమైన అలోక్సెన్ కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పిండిని వాడటంపై ఆంక్షలు విధించాయి. రోజువారిగా ప్రస్తుతం మనం తినే బ్రెడ్, కేకులు, పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ అన్నీ మైదా పిండితో చేసినవే. మైదా పిండితో తయారు చేసిన ఆహారాల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ఇది ఒకింత అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Health Tips: మాత్రలు మింగే వారు వీటితో కలిపి వేసుకోవద్దు,అలా మింగితే మాత్రలు పనిచేయకపోయే ప్రమాదం ఉందంటున్న డాక్టర్లు 

గోధుమ పిండిని మైదాపిండిగా (Maida) మార్చే క్రమంలో పోషకాలు అన్నీ తొలగించబడతాయి. ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఈ పిండిలోకి రసాయనాలు వచ్చి చేరతాయి కాబట్టి దీనితో చేసిన ఆహార పదార్ధాలు తినటం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. కడుపు నిండిన భావన మాత్రమే కలుగుతుంది. అంతేకాకుండా బరువు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మైదా పిండి రక్తంలో చక్కెర స్ధాయిలు పెరగటానికి కారణమౌతుంది. అంతేకాకుండా మైదా తో తయారైన ఆహారపదార్ధాల్లో అధిక నూనె వినియోగం వల్ల శరీరంలో చెడు కొవ్వులు పెరిగే ప్రమాదం ఉంటుంది. తద్వారా గుండె సంబంధిత సమ్యలు వస్తాయి.

Drinking Hot water: గోరు వెచ్చని నీరు తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా, తెలియకుంటే ఓ సారి ఈ న్యూస్ చూడాల్సిందే 

మధుమేహులు మైదాతో తయారు చేసిన ఆహారపదార్ధాలను తినకుండా ఉండటం మంచిది. ఆమ్లత్వం కలిగిన మైదాపిండి ఆహారాలు ఎముకలకు హాని కలిగిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మైదాతో తయారు చేసిన ఆహారపదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది.