New Delhi, OCT 23: దీపావళి పండుగ (Diwali Festival) వచ్చేసింది. దీపావళి సందర్భంగా వాట్సాప్ యూజర్లతో (WhatsApp Users) కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకోవచ్చు. ఈ పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు వాట్సాప్ స్టిక్కర్లను ఉపయోగించండి. మీ ఫ్రెండ్స్ పండుగ సీజన్‌లో వాట్సాప్ యూజర్లు, కాల్‌లు, మెసేజ్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ఆన్‌లైన్‌లో స్టిక్కర్‌లను (Online stickers) ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలను చెప్పుకోవచ్చు. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వివిధ రకాల స్టిక్కర్లు, స్టిక్కర్ ప్యాక్‌లను అందిస్తోంది. వీటిని యూజర్లు చాట్ ద్వారా పంపవచ్చు. వాట్సాప్ యూజర్లు స్నేహితులు, కుటుంబ సభ్యులకు స్టిక్కర్ల ద్వారా కొత్త శుభాకాంక్షలను పంపుకోవచ్చు. దానికోసం ఈ కింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.
* మీ స్మార్ట్‌ఫోన్ లేదా వెబ్‌లో WhatsAppని ఓపెన్ చేయండి.
* ఎవరికి స్టిక్కర్‌ని పంపాలనుకున్నారో ఎంచుకోండి.
* టెక్స్ట్ బాక్స్‌కు ఎడమవైపు ఉన్న ‘smiley’పై Tap చేయండి.
* GIF ఐకాన్ కుడి వైపున ఉంచిన ‘Sticker’ ఐకాన్ ఎంచుకోండి.
* మీరు ఇప్పటికే స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసి ఉంటే.. మీరు పంపాలనుకునే Option నొక్కండి.
* మీకు స్టిక్కర్లు లేకపోతే మీరు త్వరగా ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* స్టిక్కర్‌ల విభాగంలో కుడి ఎగువన ఉన్న ‘+’ ఐకాన్‌పై నొక్కండి.
* మీరు ఎక్కువగా ఇష్టపడే స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకోండి.
* ప్రక్రియను ప్రారంభించడానికి ప్యాక్ పక్కనే ఉన్న ‘Download’ ఐకాన్‌పై నొక్కండి.
* డౌన్‌లోడ్ చేసిన తర్వాత, స్టిక్కర్‌లు ‘Sticker’ ట్యాబ్ కింద చూపతాయి.
* మీరు కేవలం Tap చేయడం, పంపడం ద్వారా మీకు ఇష్టమైన వాటి నుంచి ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
* మీ ‘My Stickers’ ట్యాబ్‌కి వెళ్లి ‘Delete Buttion’ని నొక్కండి.