Thiruvananthapuram, July 11: కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు మళ్లీ దర్శనమివ్వనున్నాడు. ఈ నెల 17 నుంచి దేవస్థానాన్ని (Kerala's Sabarimala Temple) తిరిగి తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు స్వామి వారికి పూజా కార్యక్రమాలు ( July 17 to 21 for Monthly Puja) నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకూ అవకాశం కల్పించనున్నారు. కరోనా టీకా వేయించుకున్నట్టు నిరూపించే ధ్రువీకరణపత్రంతోపాటు కరోనా లేదని నిర్ధారించే ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు ఉన్న భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. అది కూడా 5 వేల మందికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు.
పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయానికి (Sabarimala Temple) దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మండల, మకరవిళక్కు పూజల కాలంలో లక్షలాది మంది దర్శించుకుంటారు. కానీ, కరోనా కారణంగా గతేడాది నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. జులై 17న సాయంత్రం ఆలయాన్ని తెరిచి, ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి అనుమతిస్తారు.
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆరోగ్య శాఖ శనివారం నాటి బులిటెన్ ప్రకారం, గత 24 గంటల్లో కొత్తగా 14,087 కరోనా కేసులు, 109 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,53,116కు, మొత్తం మరణాల సంఖ్య 14,489కు పెరిగింది. కాగా, గత 24 గంటల్లో 11,867 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.
Here's ANI Tweet
Kerala's Sabarimala temple to be opened for devotees from July 17 to 21 for monthly puja. Devotees with complete COVID vaccination certificates or RTPCR negative report, issued within 48 hrs, will be allowed. Maximum of 5,000 devotees will be allowed through online booking system pic.twitter.com/qvmKoIWjBN
— ANI (@ANI) July 10, 2021
దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 29,22,921కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,15,226 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కరోనాకు తోడు జికా వైరస్ కేసులు కూడా కేరళలో కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం నాటికి 15 మందికి జికా వైరస్ సోకింది.