స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పానసోనిక్ (Panasonic India), ఎలుగా రే 810 (Eluga Ray 810) పేరుతో నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన టర్కోయిస్ బ్లూ మరియు స్టార్రి బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే 16MP + 2MP డ్యూయల్ వెనక కెమెరా సెటప్ మరియు 16MP సెల్ఫీ కెమెరాతో పాటు రెండు వైపులా ఫ్లాష్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 6.2-అంగుళాల HD + (720 x 1500 పిక్సెల్స్) తో అంచుల వరకూ కనిపించే 'నాచ్' డిస్ల్పేను కలిగి ఉంది.
హార్డ్ వేర్ విషయానికి వస్తే, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22 SoC ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ మరియు 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ తదితర ఫీచర్లు కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 9.0, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 మొదలగు సాఫ్ట్ వేర్ ఫీచర్లున్నాయి.
Panasonic Eluga Ray 810 విశిష్టతలు ఇలా ఉన్నాయి
6.20 ఇంచుల HD+ స్క్రీన్, 720 x 1500 పిక్సెల్స్ రెసల్యూషన్
16+2 మెగా పిక్సెల్ వెనక కెమరా, 16 మెగా పిక్సెల్ ముందు కెమరా
ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్
4000 mAh బ్యాటరీ సామర్థ్యం
ర్యామ్ 4 జీబీ, స్టోరేజ్ 64 జీబీ
అండ్రాయిడ్ 9.0 పై (Android 9.0 Pie) ఆపరేటింగ్ సిస్టమ్
ధర, రూ: 16,990/-
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అన్ని ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో మరియు రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది.