
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మిడ్ బడ్జెట్ రేంజ్‌లో 'రియల్‌మి 5ఐ' (Realme 5i) స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమంటే, ఇందులో వెనక వైపు 4 క్వాడ్ కెమెరాలు ఉన్నాయి, 12 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్స్ తో కూడిన రెండు సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ పూర్తి కెమెరా సెటప్ తో HDR, టైమ్ లాప్స్, స్లో మోషన్, బ్యూటీ, నైట్ స్కేప్ ఇలా వివిధ ఆప్షన్లతో వీడియోలు, ఫోటోలు తీసుకునే వీలు కలుగుతుంది.
అలాగే శక్తివంతమైన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో అందిస్తున్నారు. క్వాల్‌కామ్ - స్నాప్‌డ్రాగన్ 655 ప్రాసెసర్, 'అండ్రాయిడ్ 9పై' ఆపరేటింగ్ సిస్టంతో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ర్యామ్ 4 జీబీ, ఇన్ బిల్ట్ స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ.
Realme 5i Smartphone ఫీచర్లు
12 + 8+2+2 మెగా పిక్సెల్ వెనక కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
6.52-ఇంచుల HD 720x1600 రెసల్యూషన్ డిస్‌ప్లే
క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 655 ప్రాసెసర్
5000 mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.
ర్యామ్ 4 జీబీ, స్టోరేజ్ 64 జీబీ
'అండ్రాయిడ్ 9 పై' ఆపరేటింగ్ సిస్టమ్
ఈ స్మార్ట్‌ఫోన్ ధరను భారత మార్కెట్లో రూ.8,999/- గా నిర్ణయించారు. ఇది జనవరి 15, బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ (Flipkart) మరియు Realme.com వెబ్ సైట్లలో అమ్మకాని అందుబాటులో ఉండనుంది.