ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మి ఎక్స్ 2 ప్రో' (Realme X2 Pro) ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరియు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచారు. రియల్‌మి ఎక్స్ 2 ప్రో వెనకా కెమెరా 64 మెగాపిక్సిల్ గల క్వాడ్ కెమెరా సెటప్ తో ఇచ్చారు. మరియు 16- మెగా పిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్ 471 సెల్ఫీ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన క్వాల్‌కామ్ - స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ర్యామ్ మరియు స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
4GB mAh బ్యాటరీ సామర్థ్యంతో 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ, 29,999 ధరను నిర్ణయించగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999 గా నిర్ణయించారు.
అంతేకాదు, ఇప్పటివరకు మార్కెట్లో వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో 6.5-అంగుళాల పూర్తి- HD + ప్యానెల్ 90Hz డిస్ల్పేని కలిగి, 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలిజీ కలిగిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది.
ఇక దీంతో పాటే బడ్జెట్ ధరలో 'రియల్‌మి 5 ఎస్' (Realme 5s) అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేశారు. రియల్‌మి 5 ఎస్, 4 జీబీ, 64 జీబీ వేరియంట్ ధర రూ. 9,999కి లభిస్తుండగా. 4GB మరియు 128GB వేరియంట్ ధర, రూ. 10,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5-ఇన్ మినీ-డ్రాప్ డిస్ల్పే, 5000 mAh బ్యాటరీ సామర్థ్యం మరియు స్నాప్‌డ్రాగన్ 665 AIE ప్రాసెసర్ తదితర ఫీచర్లను కలిగి ఉంది.