Newdelhi, Dec 28: దేవుడి హుండీల్లో డబ్బులు, నగలతో పాటు కొన్నిసార్లు విచిత్రమైన లెటర్స్ దొరకడం చూస్తూనే ఉంటాం. అయితే, కర్ణాటకలోని (Karnataka) కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకాలోని ఘత్తరగి గ్రామంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. గ్రామంలోని భాగ్యవతి దేవి ఆలయంలో (Temple) హుండీ లెక్కింపు సందర్భంగా ఓ నోటు కనిపించింది. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని 20 రూపాయల నోటుపై రాసి దేవుడి హుండీలో ఎవరో భక్తురాలు/భక్తుడు వేశారు. ఆ నోటును గుర్తించిన సిబ్బంది నోరెళ్ళబెట్టారు. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రాసి ఉన్న నోటు చూసి అవాక్కయిన సిబ్బంది దానిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ʻತಾಯಿ ನಮ್ಮತ್ತೆ ಬೇಗ ಸಾಯಲಿʼ - 20 ರೂ. ನೋಟ್ ಮೇಲೆ ಬರೆದು ಹರಕೆ ಹೊತ್ತ ಸೊಸೆ! https://t.co/gI78ft2R21#Kalaburagi #KalaburagiTemple #Note #VowtoGod
— PublicTV (@publictvnews) December 27, 2024
ఎవరు రాసి ఉండొచ్చు??
అత్తయ్య చనిపోవాలని కోరుకుంటున్నది ఎవరై ఉంటారన్న చర్చ మొదలైంది. అలా రాసింది అల్లుడా? కోడలా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, ఏడాదికోసారి లెక్కించే భాగ్యవతి ఆలయానికి ఈసారి రూ. 60 లక్షల నగదు, కిలో వెండి వస్తువులు కానుకల రూపంలో వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.