Bengaluru Auto Driver Allegedly Slaps Passenger Over Ride Cancellation (Photo Credit: X/ @karnatakaportf)

Bangalore, SEP 05: అసలేం జరిగిందంటే.. బెంగళూరులో ఓ మహిళ ఓలా ద్వారా ఆటోను బుక్ చేసుకుంది. కానీ, తర్వాత ఆ రైడ్ రద్దు చేసి మరో ఆటోను ఎంచుకుంది. తన ఆటో రైడ్ రద్దు చేయడంతో కోపోద్రిక్తుడైన ఓలా ఆటో డ్రైవర్‌ ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ డ్రైవర్ మరో ఆటో డ్రైవర్ (Bengaluru Auto Driver) ముందే పట్టపగలు మహిళను చెంపదెబ్బ కొట్టాడు. ఇదంతా ఆ మహిళ తన ఫోన్‌లో రికార్డ్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని, లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Here's Video

 

“ఆప్ చిల్లా క్యు రహే హో (ఎందుకు అరుస్తున్నారు)?” అని ఆ మహిళ పదే పదే అడగడం వీడియోలో కనిపించింది. కోపంగా ఉన్న ఆటో డ్రైవర్, “గల్తీ సే కైసే హోతా హై (అది ఎలా పొరపాటు)?” అని బదులిచ్చాడు. ఇంధన ఖర్చులను ఎవరు భరిస్తారు? “మీ నాన్న గ్యాస్ కోసం చెల్లిస్తారా?” (Tera Baap Deta Hai Gas) అంటూ ఆమెను ప్రశ్నించాడు. ఆటో కేవలం ఒక నిమిషం దూరంలో ఉన్నప్పుడు ఓలా రైడ్‌ను రద్దు చేసినట్లు మహిళ అంగీకరించింది.

Video: వీడియో ఇదిగో, పాము, ముంగీస ఫైట్, గాయపడిన కింగ్ కోబ్రాని కాపాడిన స్నేక్ క్యాచర్, అభినందనలు తెలిపిన స్థానికులు 

పరిస్థితి విషమించడంతో పోలీసులను ఆశ్రయిస్తానని మహిళ బెదిరించింది. అయితే, డ్రైవర్ మాత్రం వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని పట్టుబట్టాడు. పదే పదే ఆమెను తనతో పాటు రమ్మని కోరాడు. తన వద్ద అప్పటికే అతని ఫోన్ నంబర్, ఆటో వివరాలు ఉన్నాయని వేరే పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని మహిళ సూచించడంతో డ్రైవర్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.