
Lucknow, Sep 25: హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో (Social Media) అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో పదో తరగతి విద్యార్థిని నిర్బంధించారు. ఉత్తరప్రదేశ్ (UttarPradesh) లో జరిగిందీ ఘటన. విద్యార్థి (Student) చేసిన కామెంట్స్ హిందూ సంస్థల ఆగ్రహానికి కారణమైందని స్థానిక బీజేపీ నాయకుడు మింటు సింగ్ పేర్కొన్నారు. విద్యార్థి చేసినట్టుగా చెబుతున్నట్టు సోషల్ మీడియా కామెంట్స్ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. బీజేపీ నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులు ఇజాత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విద్యార్థిపై ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఫర్మేషన్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని రిమాండ్ హోంకు తరలించారు.
