(Credits: X)

సకాలంలో కరెంటు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన రైతులు విద్యుత్ పంపిణీ యూనిట్ ఆవరణలోకి మొసలిని తీసుకొచ్చిన ఘటన కర్నాటకలోని విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి ఆలస్యంగా కరెంటు ఇస్తున్నారని, చీకట్లో పొలాలకు వెళ్లి ఎలా నీరందించాలని రైతులు వాపోయారు. చీకట్లో మొసళ్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తు చేసేందుకు రైతులు ఈ నిరసన చర్యకు పాల్పడ్డారు. రాత్రిపూట కరెంటు ఇస్తే మాకేం లాభం? మా సమస్యను అధికారులు అర్థం చేసుకునేందుకే మొసలిని తీసుకొచ్చామన్నారు.

వ్యవసాయ భూములకు పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ అందడం లేదు. పగటిపూట త్రీఫేజ్ కరెంటు లేక నానా అవస్థలు పడుతున్న రైతన్నలు నిద్రలేచి అర్థరాత్రి నీళ్ల కోసం సిద్ధమవుతున్నారు. గత రాత్రి పొలంలో రైతులకు మొసలి కనిపించడంతో , వెంటనే రైతులు దాన్ని పట్టుకుని ట్రాక్టర్ లో తెచ్చి విద్యుత్తు పంపిణీ కేంద్రానికి తీసుకొచ్చారు. చివరకు అటవీశాఖ అధికారులు రైతులను ఒప్పించి మొసలిని తీసుకెళ్లారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...