Newdelhi, Jan 11: పంజాబ్ (Punjab) లుధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద స్థితిలో (AAP MLA Gurpreet Gogi Bassi Found Dead) మృతిచెందారు. అర్థరాత్రి సమయంలో గుర్ ప్రీత్ గోగీకి బుల్లెట్ గాయాలు అయ్యాయని, ఆసుపత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్ ప్రీత్ గోగీ చేతుల్లో తుపాకీ ఉండగా ప్రమాదవశాత్తూ అది పేలడంతో ఆయన మరణించినట్టు ఫ్యామిలీ మెంబర్స్ పేర్కొన్నారు.
#AAP MLA #GurpreetGogiBassi found dead, family claims 'he shot himself accidentally on head'https://t.co/UI1Lv1tWrw
— Business Today (@business_today) January 11, 2025
పోలీసుల దర్యాప్తు
అయితే, గుర్ ప్రీత్ గోగీపై దండగులు ఎవరైనా కాల్పులు జరిపారా? లేక ఇంకా ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే యాంగిల్ లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)