Mumbai, Jan 7: ముంబైకి (Mumbai) చెందిన మంజుగుప్తా అనే మహిళ చేసిన ఓ పని ఇప్పుడు ఇంటర్నెట్ (Internet) ను షేక్ చేస్తుంది. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా.. ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా ఫోన్లలో (Phone) తల పెట్టుకుని కూర్చొంటున్న సమస్యకు ఆమె పరిష్కారం చూపాలనుకొన్నది. ఈ మేరకు కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొని బాండ్ (Bond) రాయించుకొన్నది. ఇంట్లో ఫోన్ అధిక వాడకంపై షరతులు విధించింది. ఈ మేరకు 50 రూపాయల బాండ్ పేపర్ పై కొన్ని షరతులు టైప్ చేయించి వారితో సంతకాలు చేయించింది. ఈ బాండ్ పేపర్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
బాండ్ పేపర్ లోని కొన్ని షరతులు
మంజుగుప్తా బాండ్ పేపర్ లో పెట్టిన కొన్ని షరతులు ఇలా ఉన్నాయి. అందరూ నిద్ర లేవగానే మొబైల్ చూడకుండా నేరుగా సూర్య దర్శనానికి వెళ్లాలి. వాష్ రూమ్ కు వెళ్లేటప్పుడు ఎవరూ ఫోన్ ను వెంట తీసుకెళ్లకూడదు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేయాలి. అన్నం తినేటప్పుడు ఫోన్ లను దూరంగా ఉంచాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే.. శిక్షగా ఆ సభ్యునికి జొమాటో, స్విగ్గీ యాక్సెస్ తీసివేస్తామంటూ రూల్స్ లో ఉంది.